ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ విషయంలో ప్రతి రాజకీయ పార్టీ, నాయకుడు తమ పోరాటాల ఫలితమే అని అంటుండగా ఇప్పుడు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తానేమి తక్కువ తినలేదన్నట్లు వామపక్ష పార్టీల ఉద్యమ ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించిందని అంటున్నారు.
తెలంగాణ లెక్చరర్స్ ఫోరం ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కేంద్రంలోని కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నారాయణ మాట్లాడుతూ చట్టం తీసుకురావడంతోనే సరిపోదని సబ్‌ప్లాన్ నిధులు ఎస్సీ, ఎస్టీలకు అందేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు. పనిలో పనిగా తెలంగాణ విషయంలో ఇక్కడి కాంగ్రెస్ నేతలు పగటి వేషగాళ్లుగా ప్రవర్తిస్తున్నారని, సోనియాను చూడగానే పాయింట్లు తడుస్తాయని ధ్వజమెత్తరు. తెలంగాణకు ప్రధాన అడ్డంకిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి గోరికట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: