ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్లో ఉగ్రవాదులు మరోసారి మారణ హోమం సృష్టించారు. అగ్ర దేశాలు తీవ్రవాదం పై ఎంత పోరాడుతున్నా, దుశ్చర్యలు ఆగడం లేదు. ఎక్కడో అక్కడ తీవ్రవాదులు పేట్రేగిపోతూనే వున్నారు.ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్లో  సోమవారం ఉదయం సెక్యురిటీ గార్డ్స్ ప్రయాణిస్తున్న ఓ మినీ బస్సును లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. పూల్-ఏ-చర్కి రోడ్లో సంభవించిన ఈ ఘటనలో 14 మంది మృతి చెందినట్లు ఆఫ్గన్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మరికొంత మంది క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాబూల్లో ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి
అత్యవసర సర్వీసులు, భద్రతా బలగాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగులు బస్సులో కార్యాలయాలకు వెళుతుండగా ఈ పేలుడు సంభవించిందని పోలీసు అధికారులు తెలిపారు. రంజాన్ మాసంలో ఈ ఘోరం చోటుచేసుకోవడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.తాలిబన్ నేత ముల్లా అక్తర్ మన్సూర్ మృతికి ప్రతీకారంగానే ఈ దాడులు జరుగుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
కాబూల్ లో ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి: 14 మంది మృతి
భారీ శబ్దంలో పేలుడు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు స్థానిక మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. మృతి చెందిన వారు నేపాల్ సెక్యురిటీ గార్డ్స్ గా భావిస్తున్నారు.  బాంబులు ధరించిన ఓ వ్యక్తి బస్సు సమీపంలోకి  కాలినడకన వచ్చి తనను తాను పేల్చేసుకున్నాడని అధికారులు వెల్లడించారు.దాడికి పాల్పడింది తామేనంటూ తాలిబాన్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: