నాకు గంజీ తెలుసు బెంజీ తెలుసు అంటూ మొదటి రాజకీయ సభలో ప్రజారాజ్యం అంటూ పేరు చెప్పి సామాజిక న్యాయం కోసం పోరాడి ఓడిపోయి పార్టీ ని కాంగ్రెస్ లో విలీనం చేసిన హీరో చిరంజీవి ఇప్పుడు రాజకీయాలాలి దాదాపు టాటా చెప్పేశారు. అందరూ రాజకీయ నాయకుల్లాగే చిరంజీవి కూడా నినాదాలు, పంచ్ డైలాగులకు మాత్రమే తన రాజకీయాన్ని పరిమితం చేశాడు. చేతల్లో చూపించింది శూన్యం. దాదాపుగా దశాబ్ధపు రాజకీయ జీవితంలో భారీ సంఖ్యలో ప్రజలకు ఉపయోగపడిన ఈ పనిని నేను చేశాను అని చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేని రాజకీయ జీవితం చిరంజీవిది. అందుకే తనకు, తనను నమ్ముకున్న కొంతమంది నాయకులకు కూడా కొన్ని పదవులు, వాటితో వచ్చే సంపాదన మినహా రాజకీయంగా చిరంజీవి చేసింది శూన్యం. అందుకే చిరంజీవి రాజకీయ జీవితం ఫ్లాప్ సినిమాగా మిగిలిపోవడానికి పెద్దగా టైం పట్టలేదు. 150 వ సినిమా తో కం బ్యాక్ ఐన చిరంజీవి తెరమీద కూడా రైతుల కోసం నిజాయతీగా పోరాటం చెయ్యలేదు అంటున్నారు. కత్తి అనే సూపర్ కథాంశం తీసుకున్న వినాయక్ - చిరంజీవి లు రైతుల దగ్గర భూములు లాక్కునే ప్రయత్నం చేసిన విలన్ ని మట్టి కరిపించడం అనేది ఇక్కడి పాయింట్.ప్రాజెక్టులని, అభివృద్ధి అని చెప్పి అవసరం లేకపోయినా, తక్కువ ఎకరాల స్థలంలోనే అవే అభివృద్ధి పనులు చేసే అవకాశం ఉన్నా కూడా కార్పొరేట్ కంపెనీల మెప్పుకోసం, ఆమ్యామ్యాల కోసం, బడా బడా బిజినెస్ పీపుల్ ఇచ్చే ఎన్నికల నిధుల కోసం వేలాది ఎకరాలను వాళ్ళకు కట్టబెడుతున్నది ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం రాజకీయాల పైన కనీస అవగాహన ఉన్న ఎవరైనా చెప్పగలరు. ఎన్నికల టైం లో సామాన్యుల కోసం , పేదల కోసం బతుకుతున్నాం అంటారు కానీ పదవి రాగానే కార్పరేట్ ప్రపంచానికి దగ్గర అయిపోతారు. ప్రభుత్వం మీద చురకత్తులు లాంటి డైలాగులు ఉంటాయి కత్తి సినిమాలో. కానీ తెలుగులో అలాంటివి తీసేసి మార్చుకున్నాం అని చిరంజీవి ప్రచార కార్యక్రమాల్లో చెబుతున్నారు. ఆ రాజకీయ విమర్శలుండబట్టే తమిళ్ కత్తిలో యాక్ట్ చేసిన విజయ్ సమస్యలు ఫేస్ చేశాడు అని నాకు ఆ సమస్య లేదన్నట్టుగా చెప్పాడు. చిరంజీవికి తెలుసో…తెలియదో కానీ విజయ్‌ని అక్కడి ప్రభుత్వం ఇబ్బందులు పెట్టి ఉండొచ్చు. కానీ ఆ సంఘటన తర్వాత జనం మాత్రం విజయ్‌ని రియల్ హీరో అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: