బాబ్లీ కేసు లో రీకాల్ పిటిషన్ పై ధర్మాబాద్ కోర్టు సంచలన తీర్పు ప్రకటించింది. ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు తరపున కోర్టుకు హాజరైన అడ్వకేట్ సుబ్బారావు రీకాల్ పిటిషన్ ను దాఖలు చేశారు. కాగా రీకాల్ పిటిషన్‌ను తిరస్కరించిన ధర్మాబాద్ కోర్టు చంద్రబాబు సహా 16మంది కోర్టుకు హాజరుకావల్సిందే అని ఆదేశాలు జారీ చేసింది.
చంద్రబాబు తరపున ఆయన న్యాయవాదులు దాఖలు చేసిన రీకాల్ పిటిషన్‌ను ధర్మాబాద్ న్యాయస్థానం తిరస్కరిస్తూ, అదే సమయంలో చంద్రబాబు కోర్టుకు హాజరు కావాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.
తదుపరి విచారణను అక్టోబర్ 15కు కోర్టు వాయిదా వేసింది. మరోవైపు ఈ కేసులో వారెంట్ అందుకున్న అప్పటి తెలంగాణ టీడీపీ నేతలకు బెయిల్ మంజూరు అయ్యింది. ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, గంగుల కరుణాకర్, కేఎస్ రత్నంకు బెయిల్ మంజూరు చేస్తూ ధర్మాబాద్ కోర్టు ప్రకటించింది. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని నిరసిస్తూ 2010 జూలై 16 వ తేదీన అప్పటి ఏపీ రాష్ట్ర విపక్ష నేత చంద్రబాబు నాయుడు, అప్పటి టీడీపీ ప్రజాప్రతినిధులు నిరసన చేపట్టేందుకు వెళ్లారు.ఈ సమయంలో అప్పటి మహారాష్ట్ర సర్కార్ చంద్రబాబు నాయుడు సహా పలువురు టీడీపీ నేతలను అరెస్ట్ చేసింది.
ఈ కేసులో ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కల్గించారనే నెపంతో చంద్రబాబు నాయుడు సహా మరో 16 మంది కి నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది ధర్మాబాద్ కోర్టు. తనపై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేయడం పై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తరపున పార్లమెంట్ సభ్యుడు, న్యాయవాది అయిన కనకమేడల రవీంద్ర కుమార్ శుక్రవారం నాడు ధర్మాబాద్ కోర్టులో రీకాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై వాదనలు విన్న ధర్మాబాద్ కోర్టు అక్టోబర్ 15వతేదీకి కేసును వాయిదా వేసింది.
ఈ పిటిషన్‌పై వాదనలు వినిపించిన చంద్రబాబు తరఫు న్యాయవాదులు తమకు ఎటువంటి నోటీసులు అందలేదని తెలి పారు. అంతేకాకుండా నాలుగు వారాల గడువు కోరారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తాము ఎవరికీ స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి అయిన కూడా కోర్టుకు హాజరు కావాల్సిందేనని తెలిపింది.
ఈ కేసులో ఎవరికీ ప్రత్యేక ట్రీట్‌మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది. అక్టోబర్ 15వ తేదీన నారా చంద్రబాబు నాయుడు సహా కేసు లో ఉన్నవారంతా హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. ఇదిలా ఉంటే కోర్టుకు హాజరైన మాజీ ఎమ్మెల్యేలు కేఎస్ రత్నం, ప్రకాష్ గౌడ్, గంగుల కమలాకర్ లకు మాత్రమే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వారి ముగ్గురికి రూ.5వేల చొప్పున జరిమానా విధించింది.
చంద్రబాబు కు సలహా యిచ్చిన శివాజి కూడా చంద్రగ్రహ దోషం ఉన్నట్లుంది. ఇప్పుడు చంద్రబాబు గారికి నాన్ బెయిలబుల్ వారంట్ అమలులో ఉన్నట్లే. ఎందుకంటె తెలంగాణా నుండి కోర్టుకు హాజర్రైన వారికి మాత్రమే బెయిల్ మంజూరు చేశారు.