మ‌ర‌క మంచిదే.. అన్న‌ట్టుగా ఎన్నిక‌ల ముంగిట పార్టీల మార్పు కూడా మంచిదే అంటున్నారు నాయ‌కులు. త‌మ అవ‌కా శం, త‌మ‌కు ద‌క్క‌నున్న అధికారం.. ఈ రెండు అంశాలే ప్రాతిప‌దిక‌గా.. నాయ‌కులు జంప్ జిలానీల అవ‌తారం ఎత్తుతున్నా రు. ఎన్నిక‌ల్లో టికెట్ల కోసం కొంద‌రు.. సామాజిక స‌మీక‌ర‌ణ‌లో భాగంగా త‌మ ప్ర‌భావాన్ని చూపించేందుకు మ‌రికొంద‌రు ఇలా.. ఎవ‌రికి వారు జంపుల మీద జంపులు చేస్తున్నారు. మ‌రో ఆరు మాసాల్లో ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో.. నేత‌ల పార్టీ మార్పు స‌హ‌జ‌మ‌నే ధోర‌ణి వినిపిస్తోంది. అటు అధికార టీడీపీలోకానీ, ఇటు విప‌క్షం వైసీపీలో కానీ.. టికెట్ రాద‌ని భావిస్తు న్న వారు.. లేదా అసంతృప్తితో ఉన్న‌వారు త‌మ‌కు అనుకూలంగా ఉండే పార్టీలోకి జంప్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. 


ఇలాంటి వారికి తురుపు ముక్క‌లా క‌నిపిస్తున్న ఏకైక పార్టీ జ‌న‌సేన‌. ఏపీలో విశేషం ఏంటంటే.. కొత్త‌గా ఏది వ‌చ్చినా.. దానిని నేత‌లు స్వాగ‌తిస్తూనే ఉంటారు. గెలుపు ఓట‌ముల‌ను కూడా ప‌ట్టించుకోరు. అచ్చు ఇప్పుడు ఇలాంటి ప‌రిణామ‌మే క‌నిపిస్తోంది. ఇద్ద‌రు మాజీ మంత్రులు త‌మ‌ పార్టీని వీడుతున్నారు. కాంగ్రెస్‌లో సీనియ‌ర్‌నేత‌గా.. మాజీ మంత్రిగా పేరు తెచ్చుకున్న ప‌సుపులేటి బాల‌రాజు.., కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి చిన్నంశెట్టి(సీ) రామ‌చంద్ర‌య్య‌లు పార్టీలు మారుతున్నారు. అయితే, వీరిద్ద‌రూ కూడా మ‌ళ్లీ వేర్వేరు పార్టీల్లోకి వెళ్తుండ‌డం గ‌మ‌నార్హం. రామ‌చంద్ర‌య్య విష‌యానికి వ‌స్తే.. ఈయ‌న చాలా కాలం కాంగ్రెస్‌లోనేఉన్నారు. 

Image result for కాంగ్రెస్ ఎమ్మెల్సీ రామ‌చంద్ర‌య్య‌

అయితే, మ‌ధ్య‌లో వైఎస్‌తో విభేదించి 2009లో చిరంజీవి పెట్టిన ప్ర‌జారాజ్యంలో చేరారు. ఇక‌, ఈ పార్టీని మ‌ళ్లీ కాంగ్రెస్లో నే విలీనం చేయ‌డంతో ఆయ‌న కూడా కాంగ్రెస్ తీర్తం పుచ్చుకున్నారు. ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే, ఇటీవ‌ల కాం గ్రెస్ అధినేత రాహుల్ గాందీ.. పార్టీకి బ‌ద్ధ శ‌త్రువు అయిన చంద్ర‌బాబుతో చేతులు క‌ల‌ప‌డాన్ని స‌హించ‌లేని రామ చంద్ర‌య్య ఆరోజే.. తాను పార్టీకి రాజీనామా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించి సంచ‌ల‌నం సృష్టించారు. ఇక రామ‌చంద్ర‌య్య‌ను పార్టీలోకి చేర్చుకునేందుకు వైసీపీ అధినేత జ‌గ‌న్ గ‌తంలోనే ప్ర‌య‌త్నాలు చేసి ఉండ‌డంతో ఇప్పుడు సీఆర్‌.. త్వ‌ర లోనే వైసీపీతీర్థం పుచ్చుకోనున్న‌ట్టు స‌మాచారం. 

Image result for పసుపులేటి బాలరాజు

ఇక‌, ప‌సుపులేటి బాల‌రాజు విష‌యానికి వ‌స్తే.. ఈయ‌న కూడా కాంగ్రెస్లో సీనియ‌ర్ మోస్ట్ నాయ‌కుడు. మాజీ మంత్రిగా కూడా చేశారు. మండల స్థాయి నేతగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలరాజు.. అంచలంచెలుగా ఎదిగారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌ రెడ్డి మంత్రివర్గాల్లో మంత్రిగా పనిచేశారు. 2014 తర్వాత కాంగ్రెస్ పరిస్థితి మారిపోయినా.. పార్టీలో కొనసాగుతూ వస్తున్నారు. ప్రస్తుతం విశాఖ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే, ప్ర‌స్తుతం మారిన ప‌రిణామాల నేప‌థ్యంలో ముఖ్యంగా కాంగ్రెస్‌-టీడీపీ దోస్తీని స‌హించ‌లేక ఈయ‌న కూడా పార్టీ మారిపోయారు. తాజాగా ఈయ‌న జ‌న‌సేన‌లో చేరిపోయారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విశాఖ నుంచి ఈయ‌న టికెట్ ఆశిస్తున్నారు. సో.. ఇదీ ఈ ఇద్ద‌రు మాజీ మంత్రులు ఇలా పార్టీలు మారి పోవ‌డం సంచ‌ల‌నంగా మారింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: