ఎవరేమనుకున్నా తెలంగాణలో హరీష్ రావును క్రమక్రమంగా పక్కన పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే అంశంపై గత ఏడాది కాలంగా వార్తలు వస్తున్నాయి. హరీష్ రావు లాంటి వాళ్లు వాటిని ఖండిస్తున్నా... తెలంగాణ ప్రభుత్వంలోనూ... టిఆర్ఎస్‌లోనూ జరుగుతున్న పరిణామాలు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హరీష్ రావుకు ఎలా ప్రాధాన్యం తగ్గిపోతుందో ? స్పష్టంగా తెలిసిపోతుంది. హరీష్ రావును కేసీఆర్ పక్కన పెడుతుంటే తెలంగాణ ప్రజానీకం కూడా జీర్ణించుకోలేకపోతున్నార‌న్న టాక్ కూడా ఉంది. 


అంతెందుకు డిసెంబర్ లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి వరుసగా రెండోసారి విజయం సాధించిన కేసీఆర్ ర్ నెల రోజులకు గానీ తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయలేదు. తొలి క్యాబినెట్ ఏర్పాటులో తన తనయుడు కేటీఆర్ తో పాటు హరీష్ రావు ను పక్కన పెట్టేశారు. కెటీఆర్‌కు మంత్రి పదవి లేకపోయినా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌వి ఇవ్వడంతో అన్నీ తానై మంత్రివర్గాన్ని నడిపిస్తున్న సంగతి తెలిసిందే. మరి హరీష్ రావు ప్రాధాన్యం ఏంట‌న్న‌ది ఆలోచిస్తే దానికి ఆన్సర్ ఎవరికీ అంతుపట్టదు.


లోక్‌స‌భ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ తన కేబినెట్‌ను విస్తరించాలని అనుకున్నారు. అయితే లోక్‌స‌భ‌ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు కర్రు కాల్చి వాత పెట్టినట్టు తీర్పు ఇచ్చారు. నిజామాబాద్‌లో తన కుమార్తె కవిత కూడా ఓడిపోవడంతో కేసీఆర్ దిగి వచ్చారు. ఎంపీ ఎన్నికల ఫలితాలు కేసీఆర్‌కు వ్యతిరేకంగా రావటానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో హరీష్ ప్రాధాన్యం తగ్గించడం కూడా ఓ ప్రధాన కారణమే అన్న చర్చ తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో ఉంది.


ఎట్టకేలకు తన మంత్రివర్గాన్ని విస్తరించాలని భావించిన కేసీఆర్ కేటిఆర్ తో పాటు హరీష్ రావును కూడా తన కేబినెట్లోకి తీసుకుంటున్నట్టు సమాచారం. కేటీఆర్ కు ఆయన గతంలో మంత్రిగా ఉన్న ఐటీ శాఖ నే కేటాయిస్తూ ఉండగా.... హరీష్‌కు మాత్రం తనకు బాగా ఇష్టమైన భారీ నీటిపారుదల శాఖను కాకుండా విద్యాశాఖను కేటాయించకపోతే ఉన్నట్టు తెలుస్తోంది. హరీష్ కు సహజంగా నీటిపారుదల రంగం అంటే ఎంతో ఇష్టం. అందుకే తెలంగాణ ఏర్పడిన వెంటనే కేసీఆర్ ఆయనకు ఆ శాఖ‌నే కట్టబెట్టడం... తెలంగాణ ఐదేళ్లలో నీటిపారుదల రంగంలో కాళేశ్వరం లాంటి మెగా ప్రాజెక్టులను నిర్మించడం జరిగింది.


అయితే ఇప్పుడు హరీష్ కు త‌న‌కిష్ట‌మైన నీటిపారుద‌ల శాఖ కాకుండా విద్యాశాఖను కేటాయించడం వెనక మతలబు ఏంటి అన్నది కూడా ఎవరికి అర్థం కావడం లేదు. మరికొందరు మాత్రం హరీష్ ప్రయార్టీని తగ్గించే ప్రయత్నంలో భాగంగానే ఇదంతా జరుగుతోందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక కేసీఆర్ క్యాబినెట్ లో మహిళా మంత్రులు లేరని వస్తున్న విమర్శలకు... పార్టీ మారిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి మంత్రి పదవి ఇవ్వనున్నారని సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: