గత నెల రోజుల నుంచి భూకంపాలు పలు దేశాల్లో పెను సంచలనాలు సృష్టిస్తున్నాయి. నెపాల్ లో వచ్చిన భూకంపం ఖాట్మాండు లాంటి ప్రదేశాలను నెల మట్టం చేశాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన అతి పెద్ద భూకంపంగా పేర్కొన్నారు. తాజాగా మలేసియాలో నేటి తెల్లవారుజామున భూకంపం సంభవించింది, అందరూ నిద్రలో ఉన్న సమయంలో భూమి కంపించడంతో పలువురు ఇళ్లలోనే ఇండిపోయారు.

ఈ మధ్య నెపాల్ లో జరిగిన భూకంపానికి సర్వనాశనమైన ఊరు


రిక్టర్ స్కేలుపై ఈ భూకంపం తీవ్రత 6.0గా నమోదైనట్లు యూఎస్ జియాలాజికల్ సర్వే తెలిపింది. భూకంపం సంభవించిన ప్రాంతం రానావు పట్టణానికి 19 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది. మలేసియా ప్రభుత్వం ఎటువంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు.ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించి ఎటువంటి వివరాలు ఇంకా అందలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: