టోక్యో ఒలంపిక్స్ లో స్వర్ణం సాధించి సంచలనం సృష్టించిన నీరజ్ చోప్రా సక్సెస్ టూర్ ని సక్సెస్ గా పూర్తి చేయలేకపోవడం ఫ్యాన్స్  లో ఆందోళన కలిగిస్తుంది. టోక్యో ఒలింపిక్స్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రా తీవ్ర జ్వరం కారణంగా మంగళవారం హర్యానా లోని పానిపట్ లో ఆసుపత్రిలో చేరారు అని జాతీయ మీడియా పేర్కొంది. భారత స్టార్ జావెలిన్ త్రోయర్ తీవ్రమైన జ్వరం కారణంగా గ్రాండ్ వెల్కం నుంచి మధ్యలోనే వదిలేసి ఆసుపత్రిలో జాయిన్ అయ్యారని జాతీయ మీడియా వివరించింది.

ప్రస్తుతం ఆయన చాలా వేగంగా కోలుకుంటున్నారు అని ముందు జాగ్రత్తగా ఆయనను స్వాగత వేడుకలకు వద్దని చెప్పామని ఆయన సన్నిహితులు వివరించారు. ఈ కార్యక్రమానికి చాలా మంది హాజరు అయ్యారని తన గ్రామానికి సమీపంలో స్వాగత కార్యక్రమం జరిగే ప్రదేశం కావలెకేడ్‌ కి చేరుకున్నాడని ఫంక్షన్ జరిగే ప్రదేశానికి చేరుకోవడానికి సమయం పట్టిందని వెల్లడించారు. ఫంక్షన్ మధ్యలో అతను అలసిపోయినట్లు కనిపించాడు అని స్వల్పంగా జ్వరం రావడం మొదలయింది అని పేర్కొన్నారు.

అతడిని ఆసుపత్రికి తరలించినట్లు కొన్ని పుకార్లు ఉన్నాయి అని  ఇది నిజం కాదని అన్నారు. అతను బాగానే ఉన్నాడు అని ఇది తీవ్రమైన సమస్య కాదు అని ఆయన సన్నిహితులు వివరించారు. సాధారణంగా, అతను టోక్యో నుండి వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలకు నాన్‌ స్టాప్‌ గా హాజరు కావడం వల్ల అలసిపోయినట్లు అనిపిస్తుందన్నారు. 23 ఏళ్ల నీరజ్ ఒలింపిక్స్‌ లో స్వర్ణం గెలిచిన భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్‌ గా చరిత్ర సృష్టించాడు. అతను పానిపట్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన స్వస్థలమైన ఖండ్రా గ్రామానికి వెళ్లాడు అని ఆయన సన్నిహితులు వివరించారు. ఇక ఆయనకు జ్వరం కారణంగా కరోనా పరిక్షలు కూడా నిర్వహించామని సన్నిహితులు మీడియాకు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: