ఐపీఎల్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు అంబటి రాయుడు. ఇక ఈ తెలుగు క్రికెటర్ ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటూ అద్భుతంగా రాణిస్తూ ఉంటాడు అనే విషయం తెలిసిందే. అయితే ఇంత ప్రతిభ ఉన్న క్రికెటర్కు ఎందుకు టీమిండియాలో అవకాశాలు రాలేదు అన్న చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. కొన్ని సార్లు సెలెక్టర్స్ తన పట్ల వివక్ష చూపుతున్నారు అంటూ ఏకంగా తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించటం అందరినీ షాక్ కి గురిచేసింది.


 ఇకపోతే అటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక ఆటగాడిగా ప్రతి మ్యాచ్ లో కూడా అద్భుతంగా రాణిస్తూ  ఉంటాడు. అయితే ఈ ఏడాది కూడా మంచి ప్రదర్శన చేశాడు. కానీ కొన్ని మ్యాచ్ లలో మాత్రం అంచనాలను అందుకోలేకపోయాడు అంబటి రాయుడు.  ఇకపోతే ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ ఏడాది గడ్డు పరిస్థితులను ఎదుర్కొని ఇక ఐపీఎల్ నుండి  నిష్క్రమించిన రెండవ జట్టుగా చెత్త రికార్డులు నమోదు చేసింది. ఇలాంటి సమయంలోనే అటు అంబటి రాయుడు తాను రిటైర్ మెంట్ ప్రకటిస్తున్నట్లు చెప్పి అందరికీ షాకిచ్చాడు.


 ప్రస్తుత ఐపీఎల్ సీజన్ తనకు చివరిది అంటూ సోషల్ మీడియా వేదికగా తెలిపాడు అంబటి రాయుడు. అభిమానులు అందరూ కూడా షాక్ లో మునిగిపోయారు  ఇక ఇప్పుడు అంబటి రాయుడు రిటైర్మెంట్ ప్రకటన లో ట్విస్ట్ చోటుచేసుకుంది అన్నది తెలుస్తుంది. రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు ఒక పోస్టు పెట్టిన అంబటి రాయుడు దానిని తొలగించాడు. దీంతో అందరూ కన్ఫ్యూషన్ లో మునిగిపోయారు. ఈ క్రమంలోనే అంబటి రాయుడు రిటైర్మెంట్ పై చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథ్ స్పందించారు. అంబటి రాయుడు రిటైర్మెంట్ కావడంలేదు. అతడు మాతోనే ఉంటాడు. ప్రస్తుత సీజన్లో ఫామ్ లో లేకపోవడం తో ఈ నిర్ణయం వైపు వెళ్లి ఉండచ్చు.. ఏదైనా రాయుడు మాతోనే ఉంటాడు అంటూ క్లారిటీ ఇచ్చారు..

మరింత సమాచారం తెలుసుకోండి: