ఇటీవల భారత పర్యటనకు వచ్చిన సౌత్ ఆఫ్రికా టి20, వన్డే సిరీస్ ఆడింది. అయితే ఈ రెండు సిరీస్లలో కూడా సౌత్ ఆఫ్రికాకు నిరాశ ఎదురయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. టి20 సిరీస్ లో రెండు మ్యాచ్లలో ఓడిపోయి సిరీస్ టీమ్ ఇండియాకు కట్టబెట్టిన సౌత్ ఆఫ్రికా వన్డే సిరీస్ లో కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. మొదటి మ్యాచ్లో గెలిచి సత్తా చాటినప్పటికీ తర్వాత రెండు మ్యాచ్లలో వరసగా ఓటమి చవి చూస్తుంది. ఈ క్రమంలోనే వన్డే సిరీస్ కూడా ఆదిత్య టీమిండియా చేతిలో పెట్టి మళ్లీ తమ దేశానికి వెనిదిరిగింది సౌత్ ఆఫ్రికా జట్టు. ఇటీవలే ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మూడో వన్డే మ్యాచ్లో టీమిండియా ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి సౌత్ ఆఫ్రికా ను చిత్తుగా ఓడించింది.


 అయితే వన్డే సిరీస్ లో అటు సౌత్ ఆఫ్రికా జట్టు ఓడిపోయినప్పటికీ ఒక సరికొత్త రికార్డును నెలకొల్పింది అని చెప్పాలి. ఓడిపోయిన ఏదో ఒక రికార్డు నెలకొల్పాలని అనుకుందో లేకపోతే ఇంకేదైనా కారణం ఉందో కానీ సౌత్ ఆఫ్రికా సాధించిన రికార్డు మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతుంది అని చెప్పాలి. మూడో వన్డే మ్యాచ్ కు డేవిడ్ మిల్లర్ కెప్టెన్గా వ్యవహరించాడు అన్న విషయం తెలిసిందే. అయితే భారత్ తో జరిగిన మూడు వన్డే మ్యాచ్లో సిరీస్ లో భాగంగా సౌత్ ఆఫ్రికా తమ జట్టు సారధులను మార్చడం మూడోసారి కావడం గమనార్హం.


 మొదటి వన్డే కు రెగ్యులర్ కెప్టెన్ టెంప భావుమా కెప్టెన్సీ వహించగా రెండో వన్డేలో కేశవ్ మహారాజ్ సారధ్య బాధ్యతలు చేపట్టాడు. బావుమా అనారోగ్య కారణాల వల్ల మిగిలిన రెండు మ్యాచ్లకు దూరమయ్యాడు. అయితే కేశవ మహారాజ్ సైతం విశ్రాంతి కోరుకున్నట్లు తెలుస్తుంది. దీంతో ఇక మూడో వన్డే మ్యాచ్ కి డేవిడ్ మిల్లర్ ను కెప్టెన్ గా నియమిస్తూ ఆ దేశ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్లో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ లో ఒక్కో మ్యాచ్ కి ఒక్కో కెప్టెన్ రావడం ఇదే మొదటిసారి అని చెప్పాలి. ఇలా కెప్టెన్లు మార్చడంలో సౌత్ ఆఫ్రికా రికార్డు సృష్టించింది. అయితే ఇదే విషయంపై టీం ఇండియా మాజీ ఆటగాడు స్పందిస్తూ తనదైన శైలిలో ఒక పోస్ట్ పెట్టాడు. ఇది కాస్త వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: