పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఫ్యాన్స్‌కు పండుగే. ఆయన సినిమాకి క్రేజ్, హైప్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఆయన నటించిన "ఓజీ" మూవీ థియేటర్లలో రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. పవన్ మాస్, స్టైల్, యాక్షన్‌తో ప్రేక్షకుల మనసు గెలుచుకుంటే, హీరోయిన్‌గా నటించిన ప్రియాంక అరుళ్ మోహన్ తన అందం, నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఈ మూవీకీ సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అసలేంటంటే.. పవన్ సరసన నటించే ఛాన్స్‌ కోసం చాలా మంది హీరోయిన్‌లు క్యూలో నిలబడతారు. కానీ ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాత్రం ఈ గోల్డెన్ ఛాన్స్‌ని మిస్ చేసుకుందట. ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొనే.
 

మూవీ యూనిట్ సమాచారం ప్రకారం.. తొలుత "ఓజీ" మూవీకి హీరోయిన్‌గా దీపికాని అప్రోచ్ చేశారట. కథ విన్న దీపిక కూడా ఆసక్తి చూపిందట. కానీ విషయం రెమ్యూనరేషన్ దగ్గర ఆగిపోయింది. పవన్ కళ్యాణ్‌తో నటించేందుకు దీపిక ఏకంగా రూ.16 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందని టాక్. ఒక్కసారిగా షాకైన మేకర్స్ గరిష్టంగా రూ.10 కోట్ల వరకు ఇచ్చేందుకు సిద్ధమయ్యారట. అయితే దీపిక మాత్రం తాను అడిగిన 16 కోట్లలో ఒక్క రూపాయి కూడా తగ్గబోనని క్లియర్‌గా చెప్పిందట. ఈ పరిస్థితుల్లో మేకర్స్ వెనక్కి తగ్గక తప్పలేదు. దాంతో "ఓజీ"లో హీరోయిన్ ఛాన్స్ దీపికా చేతిలోంచి జారిపోయింది. ఆ తర్వాత యూనిట్ ప్రియాంక అరుళ్ మోహన్ను సంప్రదించగా, ఆమె వెంటనే ఓకే చెప్పింది. ఇలా పవన్ సరసన నటించే గోల్డెన్ ఛాన్స్ బాలీవుడ్ స్టార్ బ్యూటీ మిస్ కాగా, ప్రియాంక తనదైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకుల హృదయాలను దోచేసింది.

 

ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. కొందరు నెటిజన్లు “దీపికా ఓజీ మిస్ చేసుకోవడం ఆమె లాస్‌.. ప్రియాంక గేన్” అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు “16 కోట్లు అడగడం కూడా షాకింగ్ కానీ, ఈ సినిమాలో ప్రియాంకనే సరైన ఎంపిక” అని అంటున్నారు. మొత్తానికి పవర్ స్టార్ సినిమాని మిస్ చేసుకోవడం దీపికా కెరీర్‌లో పెద్ద నష్టం కాకపోయినా, టాలీవుడ్ ఫ్యాన్స్ మాత్రం ఒక బ్యూటీఫుల్ కాంబినేషన్ చూడకుండా మిగిలిపోయారు. మరోవైపు ప్రియాంక అరుళ్ మోహన్ మాత్రం ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుని, తన కెరీర్‌కి కొత్త రేంజ్‌ని సెట్ చేసుకుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.  ఇలా పవన్ కళ్యాణ్ "ఓజీ" మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించగా, దీపికా పదుకొనే మాత్రం ఈ క్రేజీ ఆఫర్ మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్‌గా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: