
అవతార్ ఫైర్ అండ్ యష్.. ట్రైలర్ విషయానికి వస్తే నీటి ప్రపంచాన్ని హైలైట్ చేస్తూ చూపించారు జేమ్స్. అవతార్ 3 మొత్తం కూడా అడవులను హైలెట్ చేస్తూ తీసినట్టుగా కనిపిస్తోంది ఇందులో విజువల్స్ గాని, యాక్షన్స్ సన్నివేషాలు కూడా అందరిని ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రెండు తెగల మధ్య జరిగేటటువంటి యుద్ధాన్ని విజువల్స్ వండర్ గా చిత్రీకరించారు జేమ్స్ కామెరూన్. అలాగే ఇందులో మానవ తెగ ఎలాంటి మాస్క్ లేకుండా ఊపిరి పీల్చుకోవడం వంటివి పెద్ద ట్విస్ట్ అని చెప్పవచ్చు. విఎఫ్ఎక్స్ కూడా చాలా అద్భుతంగానే తీసినట్లు కనిపిస్తోంది. మరి అవతార్ 3 ఏ విధంగా ప్రేక్షకులను అలరిస్తుందో లేదో తెలియాలి అంటే మరో మూడు నెలలు ఆగాల్సిందే.
అవతార్ సినిమా 2009లో విడుదలై ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో చెప్పాల్సిన పనిలేదు.. ఆ తర్వాత మళ్లీ 13 ఏళ్లకు "అవతార్ ది వే ఆఫ్ వాటర్" అంటూ 2022లో వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్టుగా నిలిచింది. అవతార్ 3 ట్రైలర్ చూస్తూ ఉంటే అవతార్, అవతార్ 2 సినిమాల రికార్డులను కూడా తిరగరాసేలా కనిపిస్తోందని చెప్పవచ్చు. గడిచిన రెండు నెలల క్రితం అవతార్ 3 మొదటి ట్రైలర్ ని రిలీజ్ చేయగా ఇప్పుడు తాజాగా రెండవ ట్రైలర్ కూడా విడుదల చేయడం జరిగింది మేకర్స్.