సాధారణంగా తెలుగు సినిమాలలో నువ్వు మనిషివా రాహుల్ వా అన్న డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇప్పుడు ఇలా ఈ డైలాగ్ మరోసారి చర్చకు వచ్చింది అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఈ డైలాగ్ చర్చకు రావడానికి కారణం టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ కావడం గమనార్హం. ఎందుకంటే ఈ ఏడాది వరల్డ్ కప్ లో భాగంగా కేఎల్ రాహుల్ ఎందుకో అంచనాలను అందుకోలేకపోయాడు. ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఓపెనర్గా బలులోకి దిగుతూ వరుసగా విఫలమవుతూ నిరాశపరచాడు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న కేఎల్ రాహుల్ ఆ తర్వాత మాత్రం మళ్లీ పుంజుకున్నాడు అని చెప్పాలి.. ఇక వరుసగా మూడు మ్యాచ్లలో సింగిల్ డిజిట్ స్కోర్కె వికెట్ కోల్పోయిన కేఎల్ రాహుల్.. బంగ్లాదేశ్ తో మ్యాచ్లో హాఫ్ సెంచరీ సాధించి పరవాలేదు అని అనిపించాడు. ఇక ఇటీవలే జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో కూడా మరోసారి హాఫ్ సెంచరీ చేసి అదరగొట్టాడు అని చెప్పాలి. ఇకపోతే అతను పేలవ ప్రదర్శన చేసినప్పటికీ అతనిపై ఎంతగానో నమ్మకం పెట్టుకున్న మేనేజ్మెంట్ అతనే ఫ్యూచర్ కెప్టెన్ అంటూ భావిస్తుంది.


 అయితే ఇటీవల జింబాబ్వే తో జరిగిన మ్యాచ్లో కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ చేసినప్పటికీ అతనిపై ట్రోల్స్ మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి. ఏకంగా జింబాబ్వే లాంటి పసికూన జట్టు బౌలర్ల బంతుల్లో కూడా పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డాడు కేఎల్ రాహుల్. రిచర్డ్ నగరావ బౌలింగ్లో సింగిల్ రాబట్టడానికి ఇబ్బంది పడి చివరికి మేయిడిన్ ఓవర్గా మలిచాడు. ఇలా కేఎల్ రాహుల్ కారణంగా తొలి ఓవర్ ని మెయిడిన్ గా మలిచిన బౌలర్గా పార్నల్ నగరవ రికార్డులు సృష్టించాడు. గతంలో సౌత్ ఆఫ్రికా పై కూడా మొదటి ఓవర్ లో ఇలాగే మేయిడిన్ అయ్యేలా చేశాడు. అయితే ఇటువంటి ప్రపంచ కప్ లో తొలి ఓవర్లో టీమిండియా తరఫున వచ్చింది కూడా రెండు మేయిడిన్ ఓవర్లే. అది కూడా కేఎల్ రాహుల్ బ్యాటింగ్ లోనే రావడంతో.. అతనిపై ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు నెటిజెన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: