ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు నేటి నుంచి అక్కడ టి20 సిరీస్ ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక వెల్డింగ్టన్ వేదికగా నేడు న్యూజిలాండ్, ఇంగ్లాండ్ మధ్య మొదటి టీ20 సిరీస్ జరగబోతుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఇక ఈ మ్యాచ్ ఉంటుంది అని చెప్పాలి. ఇకపోతే న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా అటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కే.ఎల్ రాహుల్ లాంటి స్టార్ ప్లేయర్లకు విశ్రాంతి ఇచ్చిన నేపథ్యంలో ఎంతో మంది యువ ఆటగాళ్లు జట్టులో చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతం తాత్కాలిక కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాడు హార్దిక్ పాండ్యా.


 అయితే టి20 ఫార్మట్ లో టీమ్ ఇండియా రెగ్యులర్ ఓపెనర్స్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ, కే ఎల్ రాహుల్ కు విశ్రాంతి ప్రకటించిన నేపథ్యంలో ఇక ఇప్పుడు న్యూజిలాండ్తో జరగబోయే టి20 సిరీస్ లో కొత్త ఓపెనర్స్ గా ఎవరు రాబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఈ క్రమంలోనే ఇదే విషయంపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా స్పందిస్తూ తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరుస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై టీమిండియా మాజీ ప్లేయర్ వసీం జాఫర్ కూడా స్పందించాడు. ఓపనర్ గా శుభమన్ గిల్ కు తోడుగా రిషబ్ పంత్ పంపించాలని.. అతను విద్వంసకర ఆటగాడు అంటూ అభిప్రాయపడ్డాడు.


 శుభమన్ గిల్ తో రిషబ్ పంత్ ఓపెనింగ్ చేస్తే బాగుంటుందని.. నేను భావిస్తున్నాను. ఎందుకంటే పంత్ విధ్వంసం ఆటగాడు.. పవర్ ప్లే లో దూకుడుగా ఆడి పరుగులు రాబట్టే సత్తా రిషబ్ పంత్ కి ఉంది. అతడు 20, 30 పరుగుల వరకు అజయంగా ఉంటే అనంతరం మరింత చెలరేగి ఆడుతూ ఉంటాడు. ఇక మూడు నాలుగు స్థానాల్లో శ్రేయస్ అయ్యర్, సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్కు రావాలి. ఐదవ స్థానంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్రస్థానంలో దీపక్ హుడా చేస్తాడని నేను అనుకుంటున్నాను. ఇక వాషింగ్టన్ సుందర్ కు కూడా చోటు లభిస్తుంది అంటూ వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: