మలయాళంలో హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో హీరోయిన్ మహిమా నంబియార్ కూడా ఒకరు. ఇమే తమిళంలో కూడా ఎంతోమంది స్టార్ హీరోల చిత్రాలలో నటించి బాగానే పాపులారిటీ సంపాదించుకుంది. సుమారుగా మలయాళం లోనే 50కు పైగా చిత్రాలలో నటించిన మహిమా నంబియార్ వరుస అవకాశాలను అందుకుంటోంది. ప్రస్తుతం ఈమె" మందాడి" అనే చిత్రంలో నటించింది. ఇందులో సూరి హీరోగా ,టాలీవుడ్ నటుడు సుహాన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నది.


మహిమా నంబియార్ సినిమా షూటింగ్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గానే కనిపిస్తూ హాట్ ఫోటోలను షేర్ చేస్తుంది. గత కొంతకాలంగా ఇమే ఫోటోల పైన ట్రోలింగ్ ఎక్కువగా జరుగుతోంది. ఈ విషయం పైన నంబియార్ స్పందిస్తూ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. గత కొంతకాలంగా తన పేరుతో తప్పుడు, అసభ్యకరమైన వ్యాఖ్యల ఫోటోలను షేర్ చేస్తూ ఉన్నారు.. కావాలని తన మీద ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని అలాంటి వార్తలను తాను ఇప్పటివరకు భరించాను ఇకమీదట భరించలేను అంటూ వార్నింగ్ ఇచ్చింది.


పదేపదే పరువు నష్టం కలిగించేలా అగౌరపరిచేల వ్యాఖ్యలు చేస్తూ ఉండడం చాలా బాధగా అనిపించింది! ఎవరు ఏమనుకున్నా ఇకమీదట సహించేది లేదు? ఎవరైనా సరే హద్దులు దాటి తనమీద అసత్య ప్రచారాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటానంటూ ఇదే తన చివరి హెచ్చరిక అంటూ మహిమా నంబియార్ హెచ్చరించింది. ఇలాంటి చర్యలు తీసుకోవడం తప్ప తనకు వేరే దారి లేదని.. అందరికీ ధన్యవాదాలు అంటూ రాసుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఈ విషయం విన్న అభిమానులు కూడా అసలు ఏమైందో అంటూ ఆరా తీస్తున్నారు. ఈ విషయంపై చాలామంది ఈ హీరోయిన్ కి సపోర్టివ్ గా నిలుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: