న్యాచురల్ స్టార్ నాని ఇప్పటివరకు ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇటీవల ఆయన చేసిన దసరా వంటి సినిమాలతో నాని కెరీర్ మాస్ రేంజ్‌కి చేరింది. ప్రస్తుతం ఆయన శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో ది ప్యారడైస్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమా పూర్తవకముందే నాని తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌కి ఓకే చెప్పేశాడు. ఆ ప్రాజెక్ట్‌ని సాహో ఫేమ్ యంగ్ డైరెక్టర్ సుజీత్ డైరెక్ట్ చేయబోతున్నాడు. దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాను ఘనంగా లాంచ్ చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారని సమాచారం. పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభం కానుండటంతో నాని అభిమానుల్లో పెద్ద ఎక్సైట్మెంట్ నెలకొంది. సుజీత్ – నాని కాంబినేషన్ ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకోవాలన్న ఆసక్తి ఇండస్ట్రీలో కూడా కనిపిస్తోంది.

ఎందుకంటే సుజీత్ ఇప్పటివరకు యాక్షన్ మాసివ్ స్టైల్‌లో సినిమాలు తీస్తూ వచ్చాడు. మరోవైపు నాని కూడా మాస్ టచ్ కలిగిన పవర్‌ఫుల్ క్యారెక్టర్స్ చేయాలన్నదే ఇప్పుడు ప్లాన్. కాబట్టి ఈ సినిమా ఆ రెండు కోణాలను కలిపేలా ఉండే అవకాశం ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్‌లో విలన్ క్యారెక్టర్ ఎవరు చేయబోతున్నారు అన్నది హాట్ టాపిక్‌గా మారింది. తాజా బజ్ ప్రకారం మలయాళ స్టార్ హీరో, డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్‌నే విలన్‌గా తీసుకునే ప్రయత్నం జరుగుతోందని టాక్. ఇప్పటికే ఆయన సలార్ సినిమాలో గ్యాంగ్‌స్టర్ షేడ్ రోల్‌తో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. ఇప్పుడు మహేష్ బాబు – రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం SSMB29లో కూడా కీలక పాత్ర చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. అలాంటి సమయంలో నాని – సుజీత్ కాంబోలో ఆయన విలన్‌గా ఎంటర్ అవుతారని వినిపించడం హాట్ టాపిక్. పృథ్వీరాజ్ ఒకవైపు హీరోగా సక్సెస్ అవుతూనే, విలన్‌గా కూడా బలమైన ప్రెజెన్స్ చూపిస్తున్నాడు.

అతని స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్ వేరే లెవెల్‌లో ఉంటాయి. అలాంటి వ్యక్తి నాని ఎదుట ప్రతినాయకుడిగా కనిపిస్తే.. సినిమా రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోవడం ఖాయం. ఇప్పటివరకు టాలీవుడ్‌లో అలాంటి మాస్ కాంబినేషన్లు చాలా అరుదుగా జరిగాయి. అయితే ఈ వార్తలపై ఇంకా అధికారికంగా మేకర్స్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. కానీ ఈ బజ్ నిజమైతే నాని కెరీర్‌లోనే కాకుండా టాలీవుడ్‌లో కూడా ఒక రేంజ్ విలన్ – హీరో కాంబినేషన్ మాస్ హంగామా సృష్టించే అవకాశం ఉంది. పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత మేకర్స్ కాస్టింగ్, కాన్సెప్ట్ మీద క్లారిటీ ఇవ్వనున్నారు. అప్పటివరకు అభిమానులు మాత్రం "నాని వర్సెస్ పృథ్వీరాజ్" అనే కాంబినేషన్‌పై హై ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటున్నారు. ఇక చూడాలి.. నాని – సుజీత్ కాంబినేషన్ మాస్ ఆడియెన్స్‌కి ఏ రేంజ్ సర్‌ప్రైజ్ ఇస్తుందో!

మరింత సమాచారం తెలుసుకోండి: