ఇటీవల కాలంలో అన్ని దేశాల క్రికెట్ బోర్డులు కూడా బీసీసీఐ తరహాలోనే టి20 లీగ్ లు నిర్వహిస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు సైతం ఇక ఈ ఏడాది నుంచి సరికొత్తగా టి20 లీగ్ ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఐపీఎల్ లో ఉన్న ఫ్రాంచైజీలే అటు సౌత్ ఆఫ్రికా లీగ్ లో కూడా భాగమయ్యాయి. అంతేకాదు ఇక ఐపీఎల్ తరపున ఆడుతున్న ఆటగాళ్లందరూ కూడా అటు సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ లో ఆడుతూ ఉండటం గమనార్హం.


 ఇక ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ తొలి ఎడిషన్ లో ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా సాగుతూ ఉండడంతో ఈ టోర్నీ విజయవంతంగా సాగుతుంది అని చెప్పాలి. టి20 క్రికెట్ అంటేనే ఎన్నో ఆసక్తికర ఘటనలు కీరాఫ్ అడ్రస్ అన్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ లో కూడా ఇలాంటి ఆసక్తికర ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. ఇటీవల ముంబై కేప్ టౌన్ సన్రైజర్స్ ఈస్ట్రన్ మధ్య జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక నరాలు తెగే ఉత్కంఠ మధ్య ఈ మ్యాచ్ ఎంతో హోరాహోరీగా జరిగింది అని చెప్పాలి.


 ఇదిలా ఉంటే ఇక మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతున్న సమయంలో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. సన్రైజర్స్ జట్టు బ్యాటింగ్ చేస్తున్న సందర్భంగా.. మార్కో జాన్సన్ క్రీజులో ఉన్నాడు. ముంబై బౌలర్ సామ్ కరణ్ 13వ ఓవర్లో చివరి బంతిని జాన్సన్ డీప్ మీట్ వికెట్ కార్నర్ మీదుగా షాట్ ఆడాడు. అయితే బాల్ ఇద్దరు ఫీల్డర్ల మధ్య   నుంచి బౌండరీ వైపు దూసుకు వెళ్ళింది. ఈ క్రమంలోనే బౌండరీ వద్ద ఫీల్డర్ బంతిని ఆపే ప్రయత్నంలో డైవ్ చేశాడు అని చెప్పాలి.  అయితే ఇక ఆ ఫీల్డర్ సరాసరి అక్కడే ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ ను ఢీకొట్టడంతో యాంకర్ ఒక్కసారిగా గాల్లో ఎగిరి పడింది.  అయితే అనుకోని ఘటనతో యాంకర్ షాక్ అయింది అని చెప్పాలి. కానీ ఆమెకు పెద్దగా గాయాలు కాలేదు. ఇక తర్వాత వెంటనే లేచి తనకు ఏమీ కాలేదు అంటూ చెప్పుకోవచ్చింది. ఈ వీడియో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: