
ఈ క్రమంలోనే మళ్లీ మైదానంలో అడుగుపెట్టి అదరగొడుతూ ఉన్నాడు అని చెప్పాలి. మార్ష్ షఫీల్డ్ షీల్డ్ టోర్నీలో విక్టోరియా జట్టు తరుపున బలులోకి దిగాడు మ్యాక్స్వెల్. ఈ క్రమంలోనే ఇటీవల తన బ్యాటింగ్తో విధ్వంసం సృష్టించాడు. రెండు భారీ సిక్సర్లతో 61 పరుగులు చేశాడు అని చెప్పాలి. ఇక ఇతని మెరుపు ఇన్నింగ్స్ కారణంగా ప్రత్యర్థి నిర్దేశించిన 215 పరుగుల టార్గెట్ ను విక్టోరియా జట్టు ఎంతో విజయవంతంగా బ్రేక్ చేయగలిగింది అని చెప్పాలి. అది కూడా మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్ చేదించింది. అయితే అప్పటికే విక్టోరియా జట్టు 18 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉంది.
అలాంటి సమయంలోనే ఇక బ్యాటింగ్ చేయడానికి వచ్చిన మ్యాక్స్వెల్ మైదానం నలుమూలలా కూడా అద్భుతమైన షాట్లు ఆడాడు. మరోసారి తన బ్యాటింగ్ నైపుణ్యాన్ని చూపించి అభిమానులను ఆశ్చర్యపరిచాడు.. ఈ క్రమంలోనే భారీగా పరుగులు రాబట్టడంలో సక్సెస్ అయ్యాడు అని చెప్పాలి. అయితే ప్రస్తుతం ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో కొనసాగుతున్న మ్యాక్స్వెల్ ఇక ఇప్పుడు కాలి గాయం నుంచి కోలుకొని మళ్ళీ అదరగొడుతూ ఉండడంతో ఆర్సిబి అభిమానులు అందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. మార్చ్ 31వ తేదీ నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుండగా.. ఇక మ్యాక్స్వెల్ మంచి ఫామ్ లో కొనసాగడం అటు బెంగళూరు జట్టుకు గుడ్ న్యూస్ లాంటిదే అని కామెంట్లు కూడా చేస్తూ ఉన్నారు.