ఛీ వెధవ రాజకీయాలు... సమయం సందర్భం ఉండక్కర్లదు...? పెపంచం అంతా కరోనా మహమ్మారితో చచ్చే చావు చస్తుంటే కరోనాలో నూ కరువు వచ్చినట్టుగా రాజకీయ విమర్శలు ... ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడాలు... నువ్వు కరోనావి అంటే నువ్వు కరొనవి అంటూ విమర్శలు చేసుకుంటున్నారు. అసలే కరోనా ఎప్పుడు ఎవరికి ఎంటుకుంటుందో తెలియక... ఇంట్లో ఉండలేక బయటకి వెళ్లలేక చచ్చే చావు చస్తుంటే మీ కరోడా పాలిటిక్స్ ఏంట్రా బాబు అంటూ జనాలు నాయకులను తిట్టిపోస్తున్నారు. దేశానికి ప్రధానమంత్రి అవ్వాల్సి జస్ట్ మిస్ అయిన రాహుల్ గాంధీని తీసుకుంటే ... ప్రధాని నరేంద్ర మోదీ అంటే పీకల్లోతు కోపంతో రగిలిపోయే రాహుల్ ఇప్పుడు తిట్లు కాదు ఇప్పడు మన దేశం మనకి ముఖ్యం అంటూ కొత్త పల్లవి అందుకున్నాడు. 

IHG


అసలు కరొనపై ఇప్పుడు మనమంతా పార్టీలకు అతీతంగా కలిసి పొరాడాలి... ఆ తరువాత మనం మనం కొట్టుకు చద్దాంలే అంటూ ఓ మంచి సందేశాన్ని ఇచ్చేసాడు. అసలు ఇప్పుడు ఒకడి మీద ఒకడు బురద జల్లుకునేందుకు సమయం కాదు, ప్రతి ఒక్కడూ  కరోనాని మన దేశం నుంచి గెంటేయడానికి సలహాలు ఇవ్వాలి అంటూ ఈ బ్రమ్మచారి మంచి సందేశాన్ని ఇచ్చేసాడు. అసలు ట్విట్టర్ లో ఏమేమి అన్నాడంటే.... 


‘‘ ప్రధాని నరేంద్ర మోదీతో చాలా అంశాల్లో నేను విభేదిస్తా. కానీ, ఈ సమయం మాత్రం అందుకు సరైంది కాదు. అందరూ ఐకమత్యంతో ఉమ్మడి శత్రువుతో పోరాడాల్సిన సమయమిది’’ అంటూ చాలా చక్కని మాటలు చెప్పేసాడు. తాను ప్రభుత్వానికి నిర్మాణాత్మక సలహాలు ఇస్తున్నానని గొప్పగా చెప్పసాడు. ఎవరిపై వ్యక్తిగతంగా, రాజకీయంగా బురద చల్లడానికి నేను మాట్లాడటం లేదని, అందరూ ఐకమత్యంతో కరోనా వైరస్‌పై పోరాడదాము అంటూ గొప్పగా చెప్పేసాడు. 

 

IHG


సరే కేంద్రం లో సంగతి పక్కన పెట్టండి.. మన ఏపీ విషయానికి వచ్చేద్దాం..! కనీసం రహెహుల్ గాంధీ చెప్పినట్టుగా ఇక్కడి ప్రతిపక్షం పదో వంతు అయినా చేస్తుందా అంటే అదీ లేదు. హాయిగా హైదరాబాద్ లో కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తున్న ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ... అసలు సిసలైన కరోనా పాలిటిక్స్ చేస్తున్నాడు. బాబు కంటే చిన్నవాడైన రాహుల్ చెప్పినట్టుగా రాజకీయం రాజకీయమే కరోనా కరోనా నే అన్నట్టుగా కాసేపు ఆ వెదవ రాజకీయాలన్నీ పక్కన పెట్టేసి అసలు ఈ కరోనా గురించే ప్రజలకు, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వచ్చు కదా ? అదీ లేదు. ఎప్పుడు చూడు బురద జల్లడమే పనిగా పెట్టుకుంటున్నాడు. కరోనాతో కుయ్యో మొర్రో అంటున్న ప్రజలకు ధైర్యం చెప్పడం మానేసి ... జగన్ పై బాణాలు వెయ్యడం.. జగన్ ఫెయిల్ అయ్యాడు అని చెప్పుకోవడమే పనిగా పెట్టేసుకున్నాడు. 

 

అసలే చంద్రబాబు జమానాలో సాంతం ఏపీ నిధులను నాకేసి జగన్ కు ఖాళీ ఖజానా అప్పచెప్పారు కదా ... పాపం ఆ పిల్లోడు కిందా మీదా పడి జనాలు ఎవరూ ఇబ్బంది పడకుండా అన్ని చేస్తూనీ ఇప్పుడు కరోనా తో పెజానీకం ఎవరూ ఇబ్బంది పడకుండా చూసుకుంటున్నాడు కదా తెల్ల రేషన్ కార్డు ఉన్నవాళ్లందరికి తలో వెయ్యి, నిత్యావసర సరుకులు ఇస్తున్నాడు కదా... ఇది అభినందించడం మానేసి గొంతెమ్మ కోర్కెలు కోరుతావా ..?  నీకంటే ఆ రాహుల్ బాబే నయం కదా ..! రాజకీయాలను కాస్త పక్కన పెట్టేద్దాం ... కరోనాను ఎదుర్కొందాం అని చెబుతున్నాడు...! మరి నువ్వెంటయ్యా అంటే.. ఇంకా నేను బురదలోనే ఉంటాను బయటకు రాను అన్నట్టుగా బాబు గారి రాజకీయాలు ఉన్నాయి. అయ్యా బాబు ...! ఆ రాహుల్ ని చూసి నేర్చుకోవయ్యా ! అంటున్నారు  కొంతమంది జనాలు 

మరింత సమాచారం తెలుసుకోండి: