ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు కొత్త తరహా రాజకీయాలు మొదలుపెట్టారు. నేరుగా అధికార వైసీపీతో ఢీ కొనేంత సీన్ లేదని తేలిపోవటంతోనే ‘షరతుల రాజకీయాలు’ మొదలుపెట్టారు. టీడీపీ నేతలతో పంచాయితి ఎన్నికలపై మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై అన్నీ వర్గాల జనాల్లో బాగా వ్యతిరేకత పెరిగిపోయిందట. అధికారంలోకి వచ్చి సుమారు 20 నెలలవుతున్నా ఎక్కడా తట్ట మట్టి కానీ బొచ్చెడు సిమెంటు కానీ వేయలేదట. పేదలపై రూ. 70 వేల కోట్ల పన్నులు వేశారట. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటిలపై జరిగిన దాడుల వల్ల పై వర్గాలన్నీ ప్రభుత్వానికి వ్యతిరేకమైపోయాయట. ఆలయాలపై దాడుల కారణంగా మరికొన్ని వర్గాలకూ అధికారపార్టీ దూరమైపోయిందట. మొత్తానికి చంద్రబాబు మాటల వల్ల ఈ వర్గమని, ఆ వర్గమని కాకుండా హోలు మొత్తం మీద జనాలంతా జగన్మోహన్ రెడ్డిపై తీవ్రంగా మండిపోతున్నారనేంతగా ఊదరగొట్టారు.




ఇంతవరకు బాగానే ఉంది కానీ నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే టీడీపీదే విజయం అని కొత్తగా మొదలుపెట్టారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉందని చెప్పి మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన ఆధీనంలోకి తీసేసుకున్నారు. కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులను బదిలీ చేస్తున్న వైనమే నిమ్మగడ్డ దూకుడుకు నిదర్శనంగా ఉంది. ఒకవైపు ఎన్నికల కమీషన్, కోర్టులు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందని మళ్ళీ చంద్రబాబే చెబుతున్నారు. ప్రధానమైన కమీషనర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారంటే అధికారపార్టీ ఆటలు సాగవనే కదా అర్ధం. మరలాంటపుడు ఎన్నికలు స్వేచ్చగా, నిష్పక్షపాతంగా జరిగితే అనే షరతు పెట్టడమేంటో అర్ధం కావటంలేదు.




నామినేషన్లు వేసే మొదటిరోజు పార్టీ నేతలంతా నామినేషన్లను వేసేయాలని చంద్రబాబు ఆదేశించారు. నామినేషన్లు వేసే సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలను కూడా నేతలకు చంద్రబాబు సూచించారు. నిజానికి వ్యవస్ధాగతంగా టీడీపీ చాలా బలంగా ఉంటుంది. బలమైన క్యాడర్ మద్దతున్న పార్టీ కాబట్టి చంద్రబాబు ఏ స్ధాయిలో నిర్ణయం తీసుకున్నా కింతస్ధాయి వరకు తూచా తప్పకుండా అమలైపోతుంది. ఇందుకనే నామినేషన్లు వేసేటపుడు వీడియోలు తీయాలని, సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే ఆ విషయాన్ని పార్టీ కేంద్ర కార్యాలయానికి తెలియజేయాలన్నారు. ఏదేమైనా ఏకగ్రీవాలకు అంగీకరించకుండా పార్టీ తరపున నామినేషన్లు వేయాలని గట్టిగానే చెప్పారు. మొత్తానికి నిమ్మగడ్డ+చంద్రబాబు కుట్రపూరిత రాజకీయాలకు దిగుతున్నారని వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు చూస్తుంటే నిజమే అన్నట్లుంది చద్రబాబు మాటలు చూస్తుంటే.

మరింత సమాచారం తెలుసుకోండి: