భాద్రపద మాసంలోని బహుళపక్ష తదియ ‘ఉండ్రాళ్ళతద్ది’. ఈనాడు మహిళలు ఆచరించే నోముకే – ‘ఉండ్రాళ్ళతద్ది నోము అనీ, పదహారు కుడుములతద్ది వ్రతం అనీ పేర్లు. ఈ వ్రతాన్ని గురించి పూర్వం లయకారుడైన పరమశివుడు పార్వతీదేవికి వివరించినట్లు కథనం. ఐదు సంవత్సరాలపాటు ‘ఉంద్రాళ్ళతద్ది వ్రతం’ ఆచరించి ఉద్యాపన చేయాలని శాస్త్ర వచనం...