ఇందుకు సంబంధించి చిత్ర బృందం సెన్సార్ బోర్డుకు ఒక కొత్త వెర్షన్ సమర్పించి కోర్టు కేసులను ఉపసంహరించుకునే విధంగా ప్లాన్ చేసినట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ పూర్తిస్థాయి రాజకీయాలలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ చిత్రమే చివరి సినిమా కావడంతో అభిమానులు కూడా ఈ సినిమా పైన భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ అందిస్తున్నారు. అలాగే విలన్ గా ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ నటిస్తూ ఉండడం గమనార్హం.
సుమారుగా రూ .400 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న జననాయగన్ సినిమాకి విజయ్ తీసుకున్న రెమ్యూనరేషన్ రూ.200 కోట్లకు పైగా ఉన్నట్లు వినికిడి. డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ ఏకంగా రూ.121 కోట్లకు దక్కించుకుంది. అలాగే సాటిలైట్ రైట్ హక్కులను కూడా జీ తమిళ్ రూ .64 కోట్ల రూపాయలకు సొంతం చేసుకున్నట్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ సినిమా పైన నెలకొన్న వివాదం అని అనుకున్నట్లు పరిష్కారమైతే, ఈనెల 20వ తేదీన థియేటర్లోకి రావడం ఖాయమని చెప్పవచ్చు. మరి ఈ విషయం పైన చిత్రబృందం అఫీషియల్ గా ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి మరి. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి