భాద్రపద తృతీయ తిథినాడు నోమును ఆచరించే స్త్రీలు సూర్యోదయానికి ముందుగానే అభ్యంగన స్నానమాచరించి, సూర్యాస్తమయము వరకు ఉపవాసం ఉండి, బియ్యం పిండితో ఉండ్రాళ్ళను చేసి వండి గౌరిదేవిని పూజా మందిరంలో ప్రతిష్ఠించి షోడశోపచార విధిగా పూజ గావించి, ఐదు ఉండ్రాళ్ళను గౌరీదేవికి, మరో ఐదు ఉండ్రాళ్ళను వాయనముపై దక్షిణ తాంబూలాలను ఉంచి ఐదుగురు  ముత్తయిదువులకు  వాయనం ఇవ్వాలి