మనలో ఉన్న గొప్పతనం మరియు ఈ వైభవం అంతా ఈశ్వరుడి వలన వచ్చింది అనుకుంటే మనలోని అహంకారం క్షణంలో నశిస్తుంది. దీనితో పాటు మనలో ఉన్న ఈర్ష్య, అసూయ మరియు శత్రుత్వాలు కూడా నశించి అదృశ్యమవుతాయి. అంతే కాకుండా వేరొకరు బాగుపడితే అసూయ పడకూడదు. అదే విధంగా వేణునాద విద్వాంసుడు తన కన్నా ప్రావీణ్యం గల మరొక వేణునాద విద్వాంసునిపై ఈర్ష్యను పెంచుకోవచ్చు.