శివరాత్రి అనేది చాలా మహత్తరమైన రోజు. ఆ రోజున శివ భక్తులంతా మహా భక్తితో పూజల్లో మునిగి తేలుతారు. శివరాత్రి నవరాత్రులు భక్తులంతా జాగారాలతో శివుని సేవలో ఉంటారు. అన్ని శివుని దేవాలయాలు ముక్కంటి నామ స్మరణలతో మారు మోగుతాయి. భక్తుల ఉదరం నుంచి వచ్చే ఓంకార నాదంతో... ఓం నమఃశివాయ అంటూ భక్తులు... భక్తి తన్మయత్వంలో మునిగి పోతారు.