మతాలు, కులాలు, వర్గాలు వేరు కావచ్చు... కానీ ప్రజలు అందరూ ఏదో ఒక రూపంలో ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఉంటారు. పేర్లు ఏవైనా కానీ... దైవశక్తి పై నమ్మకం ఉంచి ఎంతగానో ఆరాధిస్తుంటారు. ఇక ఆ దేవుని దూతలుగా చెప్పబడే బాబాలు, సాధువులు నైతే జనాలు పూర్తిగా విశ్వసిస్తుంటారు. వారు ఆ దేవుని యొక్క వారదులుగా భావించి.. వారి చుట్టూ తిరుగుతూ తమ కోరికలను వారితో మొర పెట్టుకుంటుంటారు.