సంక్రాంతి పండగ వచ్చేసింది సరదాలు ఎన్నో తెచ్చేసింది. సంక్రాంతి పండుగను మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు అన్న విషయం తెలిసిందే. సంక్రాంతి పండుగలో భాగంగా హరిదాసుల కీర్తనలు ఇంటిముందు గొబ్బెమ్మలు గంగిరెద్దుల ఆటలు... రంగురంగుల రంగవల్లులు.. ఇలా సాంప్రదాయంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. ఇక సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఇల్లంతా బంధుమిత్రులతో సందడి సందడి గా మారిపోతుంది. ఈ మూడు రోజులపాటు ఒకవైపు సాంప్రదాయమైన పండుగ జరుపుకుంటూ దేవుళ్లను ఆరాధిస్తూనే మరోవైపు సంక్రాంతి పండుగను ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. 

 

 

 అయితే సంక్రాంతి పండుగ తెలుగు రాష్ట్రాల్లో  అంగరంగ వైభవంగా జరిగినప్పటికీ... తెలంగాణ రాష్ట్రం కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంబరాలు మరింత అంబరాన్ని అంటేలా ఉంటాయి. ఇక్కడ రంగవల్లులు గొబ్బెమ్మలు హరిదాసుల కీర్తనలు గంగిరెద్దుల ఆటలు మాత్రమే  కాదు... కోడి పందాలు... జల్లికట్టు లు ఇలా అన్ని  హోరెత్తుతున్నాయి. అందుకే సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఆంధ్ర జిల్లాల్లో కి వెళ్లడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇక ఆంధ్ర జిల్లాలు అన్నింటిలో కోడి పందాలు ఎక్కువగా జరుగుతూ  ఉంటాయి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కోడిపందాలు చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. 

 

 

 అయితే ఇప్పుడు మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఆ సంక్రాంతి సంబరాలు ఎక్కడా కనిపించడం లేదు... అవును! గతేడాది సంక్రాంతికి ఉన్న సంబరం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కనిపించడం లేదు. ప్రస్తుతం రాజధాని రగడ రాష్ట్రాన్ని మొత్తం కుదిపేస్తోంది. ఏకంగా 29 గ్రామాల్లో ప్రజలు నిరసన బాట పట్టి తీవ్రస్థాయిలో ఆందోళన చేస్తున్నారు. దీంతో సంక్రాంతి పండుగను బహిష్కష్కరించేందుకు కూడా నిర్ణయించుకున్నారు 29 గ్రామాల ప్రజలు. ఇక అధికార వైసిపి నిరసన చేస్తుంది  పెయిడ్ ఆర్టిస్టులను అంటుంటే    కాదు వారు నిజమైన రైతులు అంటున్నారు ప్రతిపక్ష టీడీపీ నేతలు. ఏదేమైనా రాజధాని గ్రామాల్లో పోలీసుల తో హడావిడి నడుస్తుండడంతో.. అక్కడ సంక్రాంతి పండుగ కళ గతేడాదితో పోలిస్తే బాగా తగ్గిపోయింది అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: