తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో పుణ్య‌క్షేత్రాలు ఉన్నాయ‌న్న సంగ‌తి తెలిసిందే. అందులో  కొండగట్టు కూడా ఒకటి. తెలంగాణలోని జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో వెలసిన కొండగట్టు అంజన్న భక్తుల పాలిట కొంగు బంగారం. ఈ దేవాలయం నిత్యం శ్రీరామ భజనలతో, అంజన్న భక్తులతో కిటకిటలాడుతుంటుంది. స్థానికుల కథనం ప్రకారం ఈ గుడిలో 40 రోజుల పాటు పూజలు చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తులు విశ్వాసం.

 

ఇక ఈ దేవాల‌యం విష‌యానికి వ‌స్తే.. పూర్వం రామ రావణుడు యుద్ధం జరిగే సమయంలో లక్ష్మణుడు కొద్ది సేపు మూర్చపోతాడు. ఆ సమయంలో సంజీవని తేవడానికి హనుమంతుడు వెలుతారు. సంజీవని మూలికలు దొరక్కపోవడంతో ఆ మూలికలు ఉన్న పర్వతం మొత్తాన్ని పెకిలించుకొని లంకకు తిరుగు ప్రయాణమవుతాడు. మార్గమధ్యంలో ఆ పర్వతం లోని కొంత భాగం కిందికి పడుతుంది. ఆ భాగమునే కొండగట్టుగా కల పర్వతభాగముగా పిలుస్తున్నారు.

 

ఇక్కడ ఆంజనేయుడు రెండు ముఖాలు అంటే.. నృసింహస్వామి, ఆంజనేయస్వామిలా కనిపించడం విశేషం. మ‌రియు శంఖు చక్రాలు హృదయంలో సీతారాములను కలిగి ఉండటాన్ని మ‌రో విశేషంగా చెప్పుకుంటారు. అందువల్లే ఈ రూపాన్ని దర్శించుకోవడానికి దేశ విదేశాల నుంచి ఎక్కువ సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. అలాగే ఇక్కడి పుష్కరిణిలో స్నానం ఆచరిస్తే పాపాలు పోతాయని కూడా న‌మ్ముతారు. ఇక ప్రస్తుతం ఉన్న దేవాలయము 160 సంవత్సరాల క్రితము కృష్ణారావు దేశ్‌ముఖ్‌ చే కట్టించబడింది.

  

మరింత సమాచారం తెలుసుకోండి: