కరోనా మహమ్మారి దెబ్బకు మానవ జీవితం అస్తవ్యస్తం అయ్యింది. ఎక్కడికి వెళ్లలేని..ఏ వేడుకా చేసుకోలేని పరిస్థితులు దాపురించాయి.పుట్టినరోజు వేడుకలు, పెళ్లిళ్లతో పాటు ఏటా ఎంతో వైభవంగా జరుపుకునే పండుగలు కూడా కళ తప్పుతున్నాయి. ఇప్పటికే ఉగాది, శ్రీరామ నవమి, గుడ్ ఫ్రైడే, రంజాన్ పండుగలను ఇళ్లల్లో ఉండే జరుపుకున్నారు. ఇక తెలంగాణ ప్రజలు ఘనంగా,ఇష్టం జరుపుకునే ఆషాడ మాసంలో వచ్చే బోనాలను ఈసారి ఇళ్ళల్లోనే జరుపుకోవాల్సి వస్తుంది. బోనాల పండుగ వేడుకలకు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈనెల 25న గోల్కొండ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 

 

గోల్కొండ బోనాల వేడుకల్లో 10మంది మాత్రమే పాల్గొంటారు. అన్ని దేవలయాల్లోనే ప్రభుత్వమే స్వయంగా పట్టువస్త్రాలు సమర్పిస్తుంది. ఈసారి పూజారులు మాత్రమే ఆలయాల్లో బోనాలు నిర్వహిస్తారు. గటాల ఊరేగింపునకు ఎలాంటి అనుమతి లేదు. ప్రజలంతా తమ మొక్కులను ఇళ్లల్లోనే చెల్లించుకోవాలి.ఉత్సవాలను టీవీలు, సోషల్ మీడియాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
హైదరాబాద్‌లో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. ప్రతి రోజు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల్లో 73శాతం కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బోనాల పండగను ఎప్పటిలానే నిర్వహిస్తే వైరస్ మరింత విజృంభించే అవకాశముందని ప్రభుత్వం భావించింది.

 


 బోనాలు, ఘటాల ఊరేగింపు వంటి కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో పాల్గొంటారని.. అలా జరిగితే కరోనా కేసులు మరింత ఎక్కువ అయ్యే అవకాశముందని అధికారులు ప్రభుత్వానికి సూచించారు. హైదరాబాద్‌లో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. ప్రతి రోజు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల్లో 94 శాతం కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బోనాల పండగను ఎప్పటిలానే నిర్వహిస్తే వైరస్ మరింత విజృంభించే అవకాశముందని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో బోనాల పండగను ఇళ్లల్లోనే జరుపుకోవాలని జంట నగరాల ప్రజలకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: