పురాణాల ప్రకారం సుబ్రహ్మణ్యస్వామి పార్వతీపరమేశ్వరుల రెండో పుత్రుడని మనందరికీ తెలుసు. ఈ స్వామిని దక్షిణ భారతదేశంతో పాటు మిగిలిన ప్రాంతాల్లో రకరకాల పేర్లతో కొలుస్తారు. మన తెలుగు రాష్ట్రాల్లో సుబ్రహ్మణ్యస్వామిగా కొలిస్తే.. తమిళనాడు రాష్ట్రంలో మురుగన్ గా ఆరాధిస్తారు. అయితే కుమారస్వామి పేరు చెప్పగానే మనందరికీ టక్కున గుర్తొచ్చేది నెమలి వాహనం. తన చేతిలోని శూలం. తమిళనాడులో ముఖ్యమైన పండుగలలో సూరసంహరం ఒకటి. ఈ పండుగను హిందువులందరూ ఘనంగా జరుపుకుంటారు. సుబ్రహ్మణ్యస్వామి తారకాసరుడు అనే రాక్షసుడిని సంహారం చేసిన తర్వాత ఈ పండుగను జరుపుకుంటారని పెద్దలు చెబుతారు.

సూర సంహారం ఎలా జరుపుకుంటారు. ఆరో రోజున భక్తులు కఠిన ఉపవాసం ఉంటారు. దీని వల్ల తమ శక్తి పెరుగుతుందని భక్తుల విశ్వాసం. ఈరోజున చేసే ఉపవాసాలను కందా శక్తి ఉపవాసం అని కూడా అంటారు. దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ తిరుచెందూర్ ఆలయం సురసంహార వేడుకలు జరిగే ప్రదేశం. ఈ సూరసంహార కార్యక్రమానికి కుమారస్వామి ఆలయం వద్దకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. తారకాసురుడు అనే రాక్షసుడిని కత్తితో చంపిన సందర్భంగా చెడుపై మంచి విజయం సాధించినందుకు సూరసంహారం జరుపుకుంటారు. దీని యొక్క పురాణ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇతిహాసాల ప్రకారం, తారకాసురుడు అనే రాక్షసుడు దేవతలను హింసించేవాడు.

 తన నుండి తప్పించుకోవడానికి దేవతలు బ్రహ్మ వద్దకు వెళ్లి సహాయం కోరారు. అప్పుడు తను శివుడు మాత్రమే సూరపద్మను నాశనం చేయగలడని చెప్పడంతో, అక్కడి నుండి దేవతలందరూ ఆలయానికి వెళ్లి శివుడిని సహాయం కోరారు. ఆ విధంగా శివుడు మురుగన్ను నుదిటితో సృష్టించాడు. ఈ రాక్షసుడిని నాశనం చేయడానికి మురుగన్ అవతరించాడని పురాణ కథనం. దేవ సైన్యాధిపతి అయిన సుబ్రహ్మణ్యస్వామిని కష్టాల్లో ఉన్నప్పుడు కొలిస్తే, సకల శుభాలు కలుగుతాయని భక్తులందరూ నమ్ముతారు. అందుకే సుబ్రహ్మణ్యస్వామిని ‘వేలాయుధన్' అని కూడా అంటారు. అందుకు ప్రధాన కారణం. తన చేతిలో శక్తివంతమైన ఆయుధం ఉండటమే. అది కేవలం ఆయుధమే కాదు. సునిశితమైన సూక్ష్మబుద్ధికి కూడా నిదర్శనం.

మరింత సమాచారం తెలుసుకోండి: