ఈ తెలుగు సంవత్సరం రోజున తెల్లవారి జామున థాయిలాభంగన స్థానం చేసి కొత్త బట్టలు ధరించాలి. ఉగాది పచ్చడి సేవించిన తరువాత కుల దేవతలకు భక్షాలు, చిత్రానం సమర్పించాలి. వేసవి తాపాన్ని ఉపసమింప చేయడానికి వడపప్పు పానకం కూడా ఉంచి తప్పకుండ స్వీకరించాలి. లక్ష్మి పూజ చేసి దానాలు చెయ్యాలి.
అలాగే ఉగాది పండుగ రోజున చేయకూడని పనులు కూడా చాలానే ఉన్నాయి. ఉగాది పండుగ రోజున ఆలస్యంగా నిద్ర లేవరాదు. మాంసహారం, మద్యం, సిగరెట్ వంటి వాటికి దూరంగా ఉండాలి. పాత బట్టలు ధరించకూడదు అన్నింటి కంటే ముఖ్యంగా దక్షిణ ముఖాన కూర్చొని పంచాంగ శ్రవణం చేయకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహించదు.
ఒక్కతెలుగు సాంప్రదాయం లోనే కాక మరాఠీలు గుడి పడ్వాగానూ, తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతోను, సిక్కులు వైశాఖీ గానూ,బెంగాలీలు పొయ్‌లా బైశాఖ్ గానూ జరుపుకుంటారు. ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. జీవితం అన్ని అనుభవములు కలిగినదైతేనే అర్ధవంతం అని చెప్పే భావం ఇమిడి ఉంది. ఉగాది రోజున అతి ముఖ్యమైన వంటకం అంటే ఉగాది పచ్చడి. దీనిని షడ్రుచుల సమ్మేళనంతో తయారు చేస్తారు. ఈ షడ్రుచులను మన జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి