శ్రావణ మాసం ఎంతో ప్రత్యేకమైనది. శుభ కార్యాలకు అనువైనది. అంతే కాకుండా మీయొక్క ఇష్ట కార్యాలు సిద్ధించడానికి ఈ మాసంలో  శివుడిని ఈ విధంగా పూజిస్తే అంతా మంచే జరుగుతుంది అని అంటున్నారు వేద పండితులు. కైలాస శిఖరాన కొలువై ఉన్న నీలకంఠుని శ్రావణమాసంలో పూజిస్తే కోరిన కోరికలు తీరుస్తాడని ప్రతీతి. ఈ నెలలో పరమేశ్వరునికి ప్రత్యేకమైన పూజలు చేయటం ద్వారా మీ జీవితం సుఖసంతోషాలతో నిండి పోతుందట. ఇప్పుడు శ్రావణమాసంలో ప్రత్యేకమైన ఆ శివారాధన పద్ధతి ఏంటో తెలుసుకుందాం. ఈ మాసంలో పలు రకాల పద్మాలు, మారేడు దళాలతో పూర్తి విశ్వాసంతో పూజిస్తే ఆ శివుని కటాక్షం వలన మన ఆర్థిక కష్టాలు తొలగిపోయి సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు. కానీ శివున్ని పూజించే సమయంలో సంపంగి పూలు కానీ, అలాగే మొగలి పువ్వులతో కానీ అస్సలు వాడరాదట అవి శివ పూజకు వినియోగించరాదట.

శ్రావణ మాసంలో శివాలయానికి వెళ్లి 108 ప్రదక్షిణాలు చేసి..అనంతరం శివలింగానికి అభిషేకం చేస్తే మీ కోరికలన్నిటిని నెరవేరుస్తాడు ఆ నీలకంఠుడు. శ్రావణ సోమవారం పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన రోజుగా చెప్పబడుతున్నది. ఈ పరమ పవిత్రమైన రోజున ఈశ్వరునికి ప్రతిరూపం అయినటువంటి రుద్రాక్షను తెచ్చి  పాలాభిషేకం చేసి.. అనంతరం నీటితో అభిషేకం చేసి ఆ రుద్రాక్షను మీ మెడలో  వేసుకోవాలి. ఇలా చేయడం వలన మీ ఆరోగ్యం పటిష్టంగా ఉంటుంది, ఎలాంటి  దుష్ట శక్తులు మీ చెంత చేరవు.


కావున శ్రావణ మాసంలో భక్తి శ్రద్దలతో పూజించిన రుద్రాక్షను మెడలో ధరించడం వలన ఎటువంటి నెగటివ్ ఎనర్జీ మీ దరి చేరదని అంటున్నారు పండితులు. అదే విధంగా శ్రావణమాసంలో శివుని ఆరాధన, ప్రత్యేక పూజలు, విశ్వాసంతో కూడిన భక్తి విశిష్ట ఫలితాలను అందిస్తుందని అంటున్నారు. మరి మీరు కూడా ఆ భోళాశంకరుడిని పై విధంగా పూజించి పునీతులు కండి.

మరింత సమాచారం తెలుసుకోండి: