ప్రతి ఏటా బిసిసిఐ వార్షిక అవార్డుల కార్యక్రమంలో అంతర్జాతీయ స్థాయిలో భారత్ తరపున అత్యన్నత ఆటతీరుని ప్రదర్శించిన ఆటగాళ్లకు పాలి ఉమ్రిగర్ అవార్డ్ అందిస్తారు. ఈ సంవత్సరం ఆ అవార్డ్ టీం ఇండియా కెప్టెన్ విరాట్ కొహ్లికి దక్కింది. ఈ అవార్డుకు తనని రికమెంట్ చేసిన బిసిసిఐకు కృతజ్ఞతలు తెలిపిన విరాట్ ఈ అవార్డ్ అందుకోవడం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

ప్రస్తుతం తాను ఈ దశలో ఉండేలా సహకరించిన వారందరికి తన కృతజ్ఞతలు తెలిపిన విరాట్ మూడోసారి పాలి ఉమిగర్ అవార్డ్ అందుకున్నందుకు చాలా ఆనందంగా ఉందని ట్వీట్ చేశాడు. ఇక తన మీద మొదటి నుండి నమ్మకం ఉంచిన వారందరికి తను థాంక్స్ చెప్పాడు కొహ్లి. 2011-12, 2014-15 సంవత్సరాల్లో జరిగిన అవార్డ్ కార్యక్రమాల్లో విరాట్ కొహ్లి ఈ అవార్డ్ కైవసం చేసుకున్నాడు.