మళ్లీ పండగ సీజన్‌తో పాటుగా క్రికెట్ సీజన్ మొదలవ్వబోతుంది.ఇది క్రికెట్ అభిమానులకు ఆనందకరమైన శుభవార్త.అయితే, 2015-16లో భారత పర్యటనకు వచ్చిన సఫారీ జట్టును ధోని నాయకత్వంలోని టీమిండియా చిత్తుగా ఓడించి టీ20,వన్డే సిరిస్‌ను గెలుచుకుందన్న విషయం తెలిసిందే.ఇక టీమిండియా దక్షిణాఫ్రికా జట్ల మధ్య సెప్టెంబర్ 15న ధర్మశాల వేదికగా మూడు టీ20ల సిరిస్ ప్రారంభం కానుంది.ఈ సందర్భంగా భారత పర్యటనలో భాగంగా సఫారీ జట్టు 3 టీ20లు,3 టెస్టు మ్యాచ్‌ల సిరిస్లు భారత్‌తో ఆడనుంది.ఇక పోతే సాధారణంగా సొంతగడ్డపై టీమిండియా సిరిస్‌ను అంత తేలిగ్గా చేజార్చుకోదని ఇప్పటికే క్రికెట్ అభిమానులు ఆశలు పెంచేసుకున్నారు.



దీనికి తగ్గట్లుగానే ధర్మశాల పోరుకోసం జట్టు సభ్యులు కఠోరసాధన చేస్తున్నారు.ఇందులో భాగంగా ముంబై ఇండియన్స్‌ సోదరులు హార్దిక్‌ పాండ్య, కృనాల్‌ పాండ్య నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సందర్భంలో కృనాల్‌ బంతులు విసరగా హార్దిక్‌ భారీ షాట్లు ఆడాడు.అయితే ఓ బంతిని దాదాపుగా కృనాల్‌ తలకు తగిలేలా బ్యాటింగ్‌ చేశాడు హార్దిక్‌.ఇక ఈ సంఘటనకు సంబంధించి సాధన ముగిసిన తర్వాత హార్దిక్‌,అన్నకు క్షమాపణలు చెబుతూ బంతిని దాదాపు నీ తలకు తగిలేలా ఆడినందుకు సారీ అంటూ తమ్ముడు ట్వీట్‌ చేశాడు.సరదాగా సాగిన ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరెల్ అవుతుంది..ఈ పోస్ట్‌ను చూస్తూ క్రికెట్ అభిమానులు పిచ్చపిచ్చగా ఎంజాయ్ చేస్తున్నారు..ముఖ్యంగా హార్దిక్ పాండ్యా ప్రాక్టీస్‌లో ధోని ట్రేడ్‌మార్క్‌ షాట్‌ అయిన హెలికాప్టర్‌ షాట్‌ను బాగా ప్రాక్టీస్‌ చేశాడు.ఇక గత పర్యటనలో టీమిండియా కేవలం విరాట్ కోహ్లీ,రోహిత్ శర్మ,శిఖర్ ధావన్‌ల పైనే ఆధారపడింది.కాని,ఈసారి మాత్రం సెలక్టర్లు పలువురు యువ క్రికెటర్లకు సైతం చోటు కల్పించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: