స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల.. వైకుంఠపురములోని బుట్ట బొమ్మ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. లిరికల్ పరంగా మాత్రమే కాదు విజువల్ పరంగా కూడా సూపర్ అనిపించుకుంది. ఈ పాటకు అల్లు అర్జున్ వేసిన స్టెప్స్ ప్రేక్షకులను అలరించాయి అంతేకాదు టిక్ టాక్ వంటి యాప్ లలో కూడా ఈ సాంగ్ ట్రేండింగ్ లో కొనసాగింది. ఇక ఈసాంగ్ క్రేజ్ దేశం దాటి  పోయింది. తాజాగా ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన సతీమణి తో కలిసి బుట్టబొమ్మ సాంగ్ కు స్టెప్పులు వేశాడు. అయితే అల్లు అర్జున్ లా అంత గ్రేస్ తో చేయలేకపోయాడు కానీ  పర్వాలేదనిపించాడు. ఈవీడియో ను వార్నర్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం అది వైరల్ అవుతుంది. 
 
ఇక ఐపీఎల్ వల్ల ఇండియన్స్ మరింత దగ్గరయ్యాడు  డేవిడ్ వార్నర్. ప్రస్తుతానికి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సారథి గా వ్యవహరిస్తున్న వార్నర్ జట్టు పై ఎప్పటికప్పుడు తనకు వున్న అభిమానాన్ని చాటుకుంటున్నాడు. ఆస్ట్రేలియా తరువాత రెండో హోమ్ టీం తనకు  సన్ రైజర్స్ అని ఇప్పటికే పలు సార్లు వార్నర్ వెల్లడించాడు. ఇప్పటివరకు దాదాపు అన్ని సీజన్లలో వార్నర్ సక్సెస్ అవుతూ వచ్చాడు. అంతేకాదు తన హయాంలో హైదరాబాద్ జట్టును ఛాంపియన్ గా కూడా నిలబెట్టాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: