రైనా ఐపీఎల్ నుంచి తప్పుకోవడంపై ఎన్నో రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి.. కరోనా వైరస్ కి భయపడి తప్పుకున్నాడని కొంతమంది.. తనకు నచ్చిన రూమ్ ఇవ్వకపోవడంతోనే రైనా తప్పుకున్నాడు అని మరికొంతమంది.. ఇలా ఎన్నో రూమర్స్ కూడా వస్తున్నాయి. అయితే ఎన్నో ఏళ్ల నుంచి ఐపీఎల్లో స్టార్ ఆటగాడిగా కొనసాగుతున్న రైనా తప్పుకోవడం సీఎస్కే కి భారీ షాక్ అనే చెప్పాలి. ఇక సిఎస్కే నుంచి తప్పుకున్న రైనా భారీగానే నష్టపోనున్నాడు అన్నది తెలుస్తుంది. ఐపీఎల్ ఆరంభ సీజన్లో సుమారు నాలుగు కోట్లకు రైనా ను కొనుగోలు చేసిన చెన్నై సూపర్ కింగ్స్... 2018 నుంచి 11 కోట్ల వరకు చెల్లిస్తోంది. ఐపీఎల్ నుంచి తప్పుకున్న రైనా 11 కోట్ల వరకు నష్టపోనున్నాడు.
అంతేకాకుండా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, బెస్ట్ క్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుల రూపంలో కూడా ఐపీఎల్లో రైనా భారీగానే సంపాదించేవాడు. ఈ ఏడాది ఐపీఎల్ నుంచి తప్పుకోవడం కారణంగా రైనా 15 కోట్ల వరకు చేజార్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. చెన్నై జట్టులో ధోని తర్వాత అత్యధిక ఆదరణ కలిగిన క్రికెటర్ గా ఉన్న సురేష్ రైనా... ఐపీఎల్ నుంచి ఉన్నఫలంగా నిష్క్రమించడంతో రైనా పై వచ్చే సీజన్లో వేటు పడే అవకాశం ఉంది అనే టాక్ కూడా వినిపిస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి