ప్రస్తుతం రోహిత్ శర్మ గురించి భారత క్రికెట్ లో చర్చ కొనసాగుతూనే ఉంది అన్న విషయం తెలిసిందే. ఐపీఎల్లో గాయం బారిన పడిన పడినప్పుడు  మొదలైన  చర్చ ఇప్పటికీ కూడా ఆగడం లేదు. ఎందుకంటే ఐపీఎల్లో గాయం బారినపడిన రోహిత్ శర్మ కొన్ని మ్యాచులు దూరమయ్యాడు ఇక ఆ తర్వాత మళ్ళీ ముంబై ఇండియన్స్ లో చేరి అద్భుతంగా రాణించాడు అన్న విషయం తెలిసిందే. కాగా  అదే సమయంలో బీసీసీఐ ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత జట్టును ప్రకటించింది. అయితే అందులో భారత జట్టులో కీలక ఆటగాడైన రోహిత్ శర్మ కు చోటు దక్కకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.



 రోహిత్ శర్మ గాయం బారిన పడిన కారణంగానే తాము తుది జట్టులోకి  ఎంపిక చేయలేదని బీసీసీఐ వివరణ ఇచ్చింది..  అంతలోనే రోహిత్ నెట్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించడం మరింత విమర్శలకు తావిచ్చింది. ఎట్టకేలకు బీసీసీఐ  పై విమర్శలు రావడంతో మెత్తబడి రోహిత్ శర్మ  ను టెస్ట్ సిరీస్ కోసం ఎంపిక చేసింది. ఇక ప్రస్తుతం రోహిత్ శర్మ బెంగళూరులో ఉన్న జాతీయ క్రికెట్ అకాడమీ లో ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు అనే విషయం తెలిసిందే. అయితే గత కొన్ని రోజుల నుంచి రోహిత్ శర్మ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని అందుకే బిసిసిఐ టెస్ట్ సిరీస్ కోసం పంపించడం లేదు అని చెప్పుకొచ్చింది.



 దీంతో మరోసారి రోహిత్ శర్మ గాయం గురించి చర్చ మొదలైంది అసలు రోహిత్ శర్మ ఫిట్నెస్ విషయంలో ఎందుకు పూర్తి వివరణ తో కూడిన నివేదిక ఇవ్వడం లేదు అంటూ రోహిత్ శర్మ అభిమానులు బీసీసీఐ ని  సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించడం మొదలు పెట్టారు. అయితే ఇటీవలే రోహిత్ శర్మ గాయం గురించి స్పష్టత వచ్చింది. బిసిసీఐ  రోహిత్ శర్మ నుంచి కోలుకుని పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించాడా  లేదా అనే విషయంపై డిసెంబర్ 11వ తేదీన స్పష్టత వచ్చే అవకాశం ఉంది అని వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: