ప్రస్తుతం భారత క్రికెట్ లో రోహిత్ శర్మ గాయం గురించి తీవ్ర స్థాయిలో చర్చ కొనసాగుతుంది అన్న విషయం తెలిసిందే. ఐపీఎల్లో గాయం బారినపడిన రోహిత్ శర్మ ఆ తర్వాత మళ్ళీ కోలుకొని ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఆడి  అదరగొట్టాడు. ఇక ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటన కోసం కూడా రోహిత్ శర్మ సెలెక్ట్ అవుతాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా బిసిసిఐ రోహిత్ శర్మను సెలెక్ట్  చేయకపోవడం ఆ తర్వాత కూడా రోహిత్ శర్మ విషయంలో ఎలాంటి కాంప్రమైస్ కాకపోవడంతో రోహిత్ శర్మ  మిగతా ఆటగాళ్లతో ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేర లేదు. అయితే ఐపీఎల్లో రాణించిన రోహిత్ శర్మ తాను ఫిట్ గా  ఉన్నానని మీడియాతో  కూడా చెప్పుకొచ్చాడు..


 కానీ బిసిసిఐ అప్పటికి కూడా రోహిత్ శర్మను ఆస్ట్రేలియా పర్యటన కోసం ఎంపిక చేయకపోవడం పై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో బిసిసిఐ ఎట్టకేలకు వెనక్కి తగ్గి ఆస్ట్రేలియా పర్యటనలో టెస్ట్ సిరీస్ కోసం రోహిత్ శర్మను ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ఇప్పుడు రోహిత్ శర్మ నేషనల్ క్రికెట్ అకాడమీ లో ఫిట్నెస్ ట్రైనింగ్ పొందుతున్నాడు అని బీసీసీఐ  చెబుతోంది. అయితే దీనిపై కూడా స్పష్టత ఇవ్వడంలేదు ఇటీవలే రోహిత్ శర్మ పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించలేదు అని బీసీసీఐ  వర్గాలు చెప్పాయి. దీంతో ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్కు దూరమయ్యే అవకాశం ఉంది అనే వాదనలు కూడా వినిపించాయి.


 అయితే తాజాగా ఇదే విషయంపై టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ గాయం పరిస్థితిపై ప్రస్తుతం భారత క్రికెట్ లో గందరగోళ పరిస్థితి నెలకొంది అంటూ వ్యాఖ్యానించాడు విరాట్ కోహ్లీ. రోహిత్ శర్మ గాయం పై ఎలాంటి స్పష్టత లేదు అంటూ వ్యాఖ్యానించాడు. రోహిత్ శర్మ ఇశాంత్ శర్మ లు పూర్తిగా ఫిట్నెస్ సాధించి కోలుకుంటే  ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ ఆడొచ్చు అంటూ చెప్పుకొచ్చాడు. ముంబై తో  కలిసి రోహిత్ ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు కాబట్టి ఇక ఆస్ట్రేలియా పర్యటన కోసం తమతోపాటు ఫ్లైట్ ఎక్కుతాడు అనుకున్నానని కానీ అతను మాత్రం రాలేదు అంటూ చెప్పుకొచ్చాడు. తర్వాత అతడు నేషనల్ క్రికెట్ అకాడమీ లో ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు అన్న విషయం తెలిసింది అంటూ చెప్పుకొచ్చాడు. ఒకవేళ రోహిత్ శర్మ కోలుకుంటే క్రికెట్ ఆడేందుకు రావచ్చు అంటూ చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ.

మరింత సమాచారం తెలుసుకోండి: