స్పాట్ ఫిక్సింగ్ కారణంగా శ్రీశాంత్ పై బీసీసీఐ 7 ఏళ్ళ నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శ్రీశాంత్ అభిమానులు అందరూ కూడా నిరాశ లో మునిగిపోయారు. బీసీసీఐ తనపై విధించిన నిషేధం పై న్యాయ పోరాటం చేసిన శ్రీశాంత్ ఇక ఆ తర్వాత కొంతమేర తనపై ఉన్న నిషేధాన్ని తగ్గించుకున్నాడు. కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఇటీవల శ్రీశాంత్ పై ఉన్న నిషేధం కాస్త తొలగిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరోసారి భారత జట్టులోకి పునరాగమనం చేసేందుకు శ్రీశాంత్ తీవ్రస్థాయిలో కష్టపడుతున్నాడు.
కొన్నేళ్ళ తర్వాత మళ్లీ మైదానంలోకి దిగి బంతి పట్టాడు శ్రీశాంత్. ఏడేళ్ల నిషేధం తర్వాత ప్రొఫెషనల్ క్రికెట్ లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ఆడేందుకు కేరళ జట్టులో శ్రీశాంత్ కు స్థానం దక్కింది. జనవరి 10 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుండగా కేరళ జట్టు తరఫున ఏళ్ల తర్వాత బరిలోకి దిగనున్నాడు శ్రీశాంత్ అయితే ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్ కారణంగా ఏడేళ్లపాటు బీసీసీఐ శ్రీశాంత్ పై నిషేధం విధించింది అన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబర్ లో నిషేధం ముగిసింది. ఈ క్రమంలోనే మైదానంలో తీవ్రస్థాయిలో ప్రాక్టీస్ చేశాడు శ్రీశాంత్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి