అయితే హైదరాబాద్ ఆటగాడు మహమ్మద్ సిరాజ్ ఇటీవల జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా భారత జాతీయ గీతమైన జనగణమన ఆలపిస్తున్న సందర్భంలో కన్నీళ్లు పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. జనగణమన ఆలపిస్తున్న సమయంలో హైదరాబాద్ ఆటగాడు మహమ్మద్ సిరాజ్ కంట నీరు రావడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాదు మహమ్మద్ సిరాజ్ కంట నీరు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఇక మహమ్మద్ సిరాజ్ ఎందుకు కంటనీరు పెట్టుకున్నారు అనే దానిపై ఆసక్తికర చర్చ కొనసాగుతూనే ఉంది.
అయితే జాతీయ గీతం ఆలపించే సమయంలో మొహమ్మద్ సిరాజ్ కంటతడి పెట్టడం పట్ల మాజీ క్రికెటర్ వసీం జాఫర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్లను ఉత్సాహ పరచడానికి స్టేడియం లో ఎక్కువ మంది ప్రేక్షకులు ఉన్నా ఒకవేళ మొత్తం లేకపోయినప్పటికీ కూడా.. ఆటగాళ్లకు భారత్ తరఫున ఆడటమే ఒక గొప్ప ప్రేరణ అంటూ చెప్పుకొచ్చాడు. ఒక దిగ్గజం చెప్పినట్లుగా నువ్వు ప్రేక్షకులకోసం ఆడటంలేదు దేశం కోసం ఆడుతున్నావు అన్నది గుర్తుంచుకోవాలి అంటూ సోషల్ మీడియా వేదికగా తెలిపాడు వసీం జాఫర్. దిగ్గజం ఎవరో కాదు మహేంద్ర సింగ్ ధోనీ అంటూ తెలిపాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి