ప్రస్తుతం టీమిండియా లో బౌలింగ్ విభాగం పటిష్టంగానే ఉందని చెప్పాలి. అయితే గతంలో టీమిండియా లోని బౌలింగ్ విభాగం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండేది కాదు. ఒకరిద్దరు స్ట్రాంగ్ బౌలర్స్ తప్ప మిగతా వారు పెద్దగా రాణించే వారు కాదు. అయితే ప్రస్తుతం టీమిండియా బౌలింగ్ దళం ప్రపంచ మేటి బౌలింగ్ విభాగంలోకి చేరిపోయింది. ముఖ్యంగా బుమ్రా రాకతో  భారత్ ఫేస్ విభాగం మరింత బలంగా మారిందని చెప్పాలి. ఇదిలా ఉండగా మాజీ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ మరొక బౌలర్ అయిన కుల్ దీప్ యాదయ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కుల్‌దీప్‌ యాదవ్‌ లాంటి ఎడమ చేతివాటం ఉన్న ఆటగాడు అంత తేలిగ్గా దొరకడని‌ పఠాన్‌ అన్నాడు. 

అతడు విభిన్నమైన బౌలింగ్ శైలితో ప్రత్యర్థి కి భయపెట్టగలడు అని తెలిపాడు. స్వదేశం లో ఇంగ్లాండ్ తో జరగబోయే టెస్ట్ సిరీస్‌లో కచ్చితంగా తుది జట్టులో చోటు చోటు దక్కలని ఆశిస్తున్నట్లు పఠాన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌కు ఎంపికైనా కుల్‌దీప్‌ ఆడలేకపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌తో జరగబోయే నాలుగు టెస్టుల సిరీస్‌లో అవకాశం వస్తే రాణిస్తాడని పఠాన్‌ పేర్కొన్నాడు.

 తుది జట్టులో అవకాశం దక్కని ఆటగాళ్ల పట్ల జట్టు యాజమాన్యం సరైన పద్ధతిలో వ్యవహరిస్తోందని నేను ఆశిస్తున్నా. వారిని మానసికంగా దృఢంగా ఉంచడం ఎంతో ముఖ్యం. అందుకే ఇటీవల యువకులు బాగా రాణించిన సందర్భాలను మనం చూశాం. అలాగే కుల్‌దీప్‌ విషయంలోనూ జట్టు అండగా ఉందని అనుకుంటున్నా. అతడో వైవిధ్యమైన బౌలర్‌. అతడికిప్పుడు 25-26 ఏళ్లు ఉంటాయి. ఈ వయసులోనే పరిణతి చెందుతాడు. రాబోయే సిరీస్‌లో ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు రాణించడానికి సిద్ధంగా ఉంటాడు’ అని మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్‌ వివరించాడు. మరి తుది జట్టులో అతడికి స్థానం దక్కుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: