ఇక వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న టీమ్ ఇండియా కు బ్రేకులు వేసింది ఇంగ్లాండ్ జట్టు. ఈ క్రమంలోనే మూడవ మ్యాచ్ లో ఎవరు విజయం సాధించ బోతున్నారు అన్నది ఎంతో ఆసక్తికరంగా మారిపోయింది. ఈ క్రమంలోనే ఇక ఇంగ్లాండ్ భారత్ మధ్య జరిగిన మూడో వన్డే మ్యాచ్ కూడా ఎంతో హోరాహోరీగా జరిగగా.. చివరి వరకు కూడా ఎవరు గెలుస్తారు అన్నది ఊహకందని విధంగా ఉండిపోయింది. చివరికి హోరాహోరీగా జరిగిన పోరాటంలో టీమిండియా ఏడు పరుగుల తేడాతో విజయాన్ని సాధించి వన్డే సిరీస్ కైవసం చేసుకుంది.
అయితే ఇంగ్లండ్తో జరిగిన మూడో వన్డే మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు ఓడిపోయినప్పటికీ అసాధారణమైన రీతిలో ఇంగ్లాండ్ జట్టు ఆల్రౌండర్ సామ్ కరణ్ చేసిన అద్భుత ప్రదర్శన మాత్రం అటు భారత ప్రేక్షకుల హృదయాలను సైతం గెలిచింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇంగ్లాండ్ జట్టు ఓడిపోయినా ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ మాత్రం హీరో అయిపోయాడు. 330 పరుగుల భారీ లక్ష్యం ముందుండగా 168 పరుగులకే ఆరుగురు కీలక బ్యాట్ మెన్స్ అవుట్ అయ్యారు. అలాంటి సమయంలో బరిలోకి వచ్చిన సామ్ కరణ్ అన్న ఎక్కడ తడబడ లేదు. 83 బంతుల్లో 95 పరుగులు చేసి ఇక జట్టును గెలిపించడానికి ఎంతో వీరోచిత పోరాటం చేశాడు. అందరూ అవుట్ అయినప్పటికీ నాటౌట్ గా నిలిచాడు సామ్ కరణ్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి