రోజుకు రూ .300 సంపాదిస్తూ దుర్భరమైన జీవితాన్ని సాగిస్తున్నాడు. అతను ఐదుసార్లు పతక విజేతగా నిలవడంతో పాటు ఎన్‌ఐఎస్ పాటియాలా నుండి ఫెన్సింగ్‌లో డిప్లొమా చదివారు. అతని 12 ఏళ్ల కుమార్తె ఖ్యతి గుప్తా కూడా ఫెన్సింగ్‌లో జాతీయ బంగారు పతక విజేత. అతని దుర్భర జీవితాన్ని చూసిన యుపి మాజీ గవర్నర్ రామ్ నాయక్ అతన్ని ఆదుకోవాలని యుపి సిఎంకు లేఖ రాశారు. ఎన్ ఆర్చరీ కోచ్ మహేంద్ర ప్రతాప్ సింగ్ (44) ఉపాధి లేక సమోసాలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. అతను జాతీయ, అంతర్జాతీయంగా పోటిల్లో పాల్గోనే యువ ఆర్చర్లను శిక్షణ ఇచ్చి పోత్సాహించాడు. ఇప్పడు ఉపాధి లేక సమోసాలు, వడలు,స్నాక్స్ విక్రయిస్తు కుంటుంబాన్ని పోషిస్తున్నారు. కోల్‌కతాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్‌ఐఎస్) నుండి ఆర్చరీలో డిప్లొమా పొందారు. జాతీయ స్థాయి పోటిల్లో 8 సంవత్సరాలు యుపి నుంచి ప్రాతినిధ్యం వహించాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి