ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఏదో ఒకటి కొత్తగా ట్రై చేయడం... ఇక వాటిని ఇతరులకు ఛాలెంజ్ చేయడం లాంటివి బాగా వైరల్ గా మారిపోతున్నాయి. అయితే ఇక ఈ మధ్య కాలంలో  ఇలాంటి చాలెంజ్ లు కాస్త తగ్గాయి. కాని మొన్నటి వరకు మాత్రం సోషల్ మీడియాలో ఏదో ఒక ఛాలెంజ్  హల్ చల్ చేస్తూనే వచ్చింది  ఏకంగా ఎంతోమంది ప్రాణాలు మీదకు కూడా తీసుకు వచ్చాయి కొన్ని ఛాలెంజ్లు  .  అయితే ఇక ఇప్పుడు భారత్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం ఒక చాలెంజ్ తో అభిమానుల ముందుకు వచ్చాడు. విరాట్ కోహ్లీ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడు అనే విషయం తెలిసిందే. కేవలం కోహ్లీ మాత్రమే కాదు అతని సతీమణి అనుష్క శర్మ కూడా ఎప్పుడు అభిమానులకు దగ్గరగానే ఉంటుంది సోషల్ మీడియా వేదికగా.



 ఇక వీరిద్దరూ లాక్డౌన్ సమయంలో ఒకరినొకరు కామెంట్స్ చేసుకుంటూ సరదాగా గడిపిన వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి హల్ చల్ చేశారు.  ఇక వీరిద్దరికీ మంచి క్రేజ్ ఉండటంతో వీరి పెట్టిన పోస్టులు కూడా వేగంగా వైరల్ గా మారిపోతూ ఉంటాయి.  అంతేకాదు వీరి పోస్టుల గురించి అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతకీ ఇటీవలే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిమానులకు ఇచ్చిన చాలెంజ్  ఏంటి అని అంటారా.  చేతి మునివేళ్ళపై బ్యాట్ ని కొంత సేపటి వరకు బాలన్స్ చేయాలి . అయితే కోహ్లీ ఇలా బ్యాట్ బాలన్స్ చేయగా ఇక పక్కనే అటు కోహ్లీ విసిరిన చాలెంజ్ స్వీకరించి కోహ్లీ సతీమణి అనుష్క శర్మ కూడా తన చేతి మునివేళ్ళపై బ్యాట్ బాలన్స్ చేసి చాలెంజ్ పూర్తి చేసింది. ఇక అభిమానులు అందరూ కూడా ఈ చాలన్ స్వీకరించాలని చెబుతున్నాడు కోహ్లీ.


 ఇటీవలే ఓ వీడియో షేరింగ్ యాప్ తో ఒప్పందం కుదుర్చుకున్న విరాట్ కోహ్లీ దంపతులు ఇక సోషల్ మీడియాలో షార్ట్ వీడియోలలో తెగ అలరిస్తున్నారు. కాగా ప్రస్తుతం టీమిండియా జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. టెస్టు సిరీస్కు ముందు దొరికిన విరామాన్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు క్రికెటర్లు. ఎలాంటి ఒత్తిడి ఉండకుండా ఇక సరదా సరదాగా గడుపుతున్నారు. ఇకపోతే అటు ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతుంది కోహ్లీసేన. ఇక మరోవైపు యంగ్ టీమ్ ఇండియా జట్టు ఇటీవల శ్రీలంక పర్యటనకు బయలుదేరింది. అక్కడ శిఖర్ ధావన్ కెప్టెన్సీలో యంగ్ టీమ్ ఇండియా జట్టు వన్డే, టి20 మ్యాచ్ లు ఆడనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: