ప్రస్తుతం భారత క్రికెట్లో టీమిండియాకు అందని ద్రాక్షల ఉన్న వరల్డ్ కప్ ను ఏకంగా తన కెప్టెన్సీలో రెండుసార్లు అందించిన కెప్టెన్గా కొనసాగుతున్నాడు మహేంద్రసింగ్ ధోని. మహేంద్రసింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు ఏ కెప్టెన్ కూడా ఈ ఘనత సాధించ లేదు అని చెప్పాలి. ఇలా ప్రస్తుతం వరల్డ్ కప్ వీరుడిగా కొనసాగుతున్న మహేంద్ర సింగ్ ధోనీ అటు అంతర్జాతీయ క్రికెట్కు దూరం అవడం అభిమానులను ఎంతగానో నిరాశపరిచింది.  ఇక పోతే ఇక ఇటీవల బీసీసీఐ కోరడంతో మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ టీమ్ ఇండియా జట్టు మెంటార్ గా వ్యవహరించేందుకు ధోని ఒప్పుకోవడం అభిమానులు అందరిలో ఎంతో జోష్ నింపింది అని చెప్పాలి.



 అయితే టి20 వరల్డ్ కప్ ఆడబోయే టీమిండియా జట్టు మహేంద్ర సింగ్ ధోనీ మెంటార్ గా నియమించడం పై మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ధోని టీమిండియాకు అవసరం లేదు అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటే.. ధోని టీమిండియాకు తోడుగా ఉంటే ఎంతగానో కలిసి వచ్చే అవకాశం ఉందని మరికొంతమంది చెబుతున్నారు. ఇక ఇటీవలే ధోనీ టీమిండియాకు మెంటార్ గా ఎంపిక కావడంపై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.



 మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ కోసం మహేంద్రసింగ్ ధోని మెంటార్ గా వ్యవహరించడం వల్ల టీమిండియా జట్టుకు ఎంతగానో మేలు జరుగుతుంది అంటూ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. ఇక ధోనీ టీమిండియా జట్టుకు మెంటార్ గా ఉండేందుకు అంగీకరించినందుకు ఎంతో సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ధోని తోడుగా ఉండడం వల్ల భారత బౌలర్లు అందరికీ కూడా ఎంతో మేలు జరుగుతుంది. పరిమిత ఓవర్ల క్రికెట్ లో మహేంద్ర సింగ్ ధోనీ తన బౌలర్లను ఎంతో అద్భుతంగా అర్థం చేసుకుంటాడు.  ధోని మళ్ళీ క్రికెట్ లోకి రావాలని అందరూ కోరుకుంటారు అని తెలుసు అంటూ వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: