విరాట్ కోహ్లీ మరియు ధోనీ ల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. దీంతో వీరిద్దరి మధ్య ఏం సంభాషణ జరిగిందనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. టీ20 వరల్డ్ కప్ 2021  ని దృష్టిలో పెట్టుకొని మహేంద్రసింగ్ ధోని టీమిండియాకు మెంటల్ గా నియమించింది బీసీసీఐ. రికార్డు టీమ్ ఇండియా జట్టుకు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు విరాట్ కోహ్లీ. ఈ తరుణంలో మహేంద్రసింగ్ ధోని మరియు విరాట్ కోహ్లీ ల మధ్య ఇప్పటి నుంచే.. ప్రణాళికల గురించి చర్చిస్తున్నట్లు సమాచారం అందుతోంది. 

ఇంకా టి20 వర ల్డ్ కప్ అనంతరం... ఆ ఫార్మాట్ లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్న సంగతి విదితమే. ఇంకా ఈ సందర్భంగా ఈ విషయంపై కూడా మహేంద్ర సింగ్ ధోనీ మరియు విరాట్ కోహ్లీ మధ్య సంభాషణలు జరిగినట్లు తెలుస్తోంది. అలాగే ఈ ఐపీఎల్ టోర్నీ అనంతరం... రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ బాధ్యతల నుంచి కూడా విరాట్ కోహ్లీ తప్పుకున్నారు. దీనిపై కూడా మహేంద్రసింగ్ ధోని తో విరాట్ కోహ్లీ మాట్లాడినట్టు సమాచారం. ముఖ్యంగా... టి20 వరల్డ్ కప్ వ్యూహాలపై వీరిద్దరు చర్చించినట్లు తెలుస్తోంది.

కాగా.... బెంగళూర్‌ పై సూపర్‌ విక్టరీ కొట్టింది చెన్నై. 157 పరుగుల టార్గెట్‌ను 18 ఓవర్లలోనే చేధించింది. కోహ్లీ, పడిక్కల్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌ వృథా అయ్యింది.   IPLలో సూపర్‌ఫామ్‌లో ఉన్న చెన్నై... మరోసారి జైత్రయాత్రను కంటిన్యూ చేసింది. యూఏఈ వేదికగా బెంగళూర్‌ను మట్టికరిపించింది. బౌలింగ్‌, బ్యాటింగ్‌ లో అద్భుత ప్రదర్శనతో కోహ్లీ టీమ్‌ను ఓడించింది. ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది చెన్నై. 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే 18.1 ఓవర్లలో చేధించింది. ఓపెనర్లు రుతురాజ్‌  గైక్వాడ్‌, డుప్లెసిస్‌ ఆకట్టుకున్నారు. రన్‌రేట్‌ పడకుండా జాగ్రత్తపడ్డారు. దీంతో చెన్నై విజయం అనివార్య మైంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: