ఐపీఎల్ 2021 రెండవ విభాగం లో జరుగుతున్న మ్యాచ్ లు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. ఇక ఇందులో భాగంగానే నిన్నటి రోజున ముంబై ఇండియన్స్ జట్టు మరియు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మధ్య ఫైట్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో ఎట్టకేలకు గెలి చేసింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. చాలా రోజులుగా తడబడుతున్నాయి బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్... ఈ మ్యాచ్లో మాత్రం కసి గా ఆడి... అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. 

ఇదిలా ఉండగా ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఓ అరుదైన రికార్డును సృష్టించాడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ.  ఈ టి 20 ఫార్మేట్ లో... ఎవరూ సాధించలేని రికార్డులను సొంతం చేసుకున్నాడు విరాట్ కోహ్లీ. ఈ పొట్టి క్రికెట్ ఫార్మాట్ లో ఎవరికీ సాధ్యం కాని పది వేల పరుగులను సాధించే చేశాడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్ ఆరోవ తొలి బంతి కి సింగిల్ తీయడం కారణంగా ఈ మైలురాయిని సాధించే చేశాడు విరాట్ కోహ్లీ.

టీమ్ ఇండియా జట్టు తో పాటు... దేశవాళీ క్రికెట్ లో ఢిల్లీ మరియు ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున... ఇప్పటివరకు 314 టీ 20 మ్యాచ్ లు  ఆడాడు విరాట్ కోహ్లీ. ఈ నేపథ్యంలోనే 133 స్ట్రైక్ రేట్ తో పది వేల పరుగుల మైలురాయిని సాధించాడు విరాట్ కోహ్లీ. ఇక ఇందులో ఏకంగా ఐదు సెంచరీలు మరియు 74 ఆఫ్ సెంచరీలు కూడా ఉండటం గమనార్హం. ఇక ఈ టి 20 ఫార్మాట్ లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు విధ్వంసకర బ్యాట్స్మెన్ క్రిస్ గేల్. కేవలం 447 మ్యాచుల్లో ఏకంగా 14, 273 పరుగులు చేసి టాప్ పొజిషన్లో నిలిచాడు  క్రిస్ గేల్.

మరింత సమాచారం తెలుసుకోండి:

rcb