బీసీసీఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఐపీఎల్లో ఎక్కువ ప్రేక్షకాదరణ పొందిన జట్టు ఏది అంటే చెన్నై సూపర్ కింగ్స్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఐపీఎల్ లో ఇప్పటివరకు ఏ జట్టుకు సాధ్యం కానీ ఎన్నో రికార్డులు అటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సొంతం అని చెప్పాలి. ఇప్పటి వరకు ఎక్కువ సార్లు ఫైనల్ చేరిన జట్టుగా..  ఎక్కువసార్లు ప్లే ఆప్ కి అర్హత సాధించిన జట్టుగా.. ఎక్కువ సార్లు టైటిల్ గెలిచిన జట్టు గా కూడా అటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొనసాగుతోంది.  భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ తిరుగు లేదు అనే విధంగానే ముందుకు దూసుకు పోతుంది. గత ఏడాది పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈసారి మాత్రం అద్భుతమైన ప్రదర్శన తో ఆకట్టుకుంది.  మొదటి నుంచి ఎంతో దూకుడుగా ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లే ఆప్ కి అర్హత సాధించిన మొదటి జట్టు గా నిలిచింది. అంతేకాకుండా ఇక ఫైనల్ లో ఎక్కడా తడబడకుండా అద్భుతమైన ప్రతిభ కనబరిచింది. మరోసారి ధోనీ కెప్టెన్సీ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఐపీఎల్లో నాలుగవసారి టైటిల్ విజేతగా నిలిచింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. అయితే సాధారణంగా ప్రతి జట్టులో కూడా ఆటగాళ్ళు కేవలం సహచరులుగా మాత్రమే ఉంటారు. కానీ అటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లో మాత్రం సహచరులు అందరూ కూడా ఒక కుటుంబంలో కలిసి పోతూ ఉంటారు.


 సూపర్ కింగ్స్ జట్టు లో ఉన్న ఆటగాళ్ల మధ్య ఎంతో బలమైన బంధం కనిపిస్తూ ఉంటుంది. ఇటీవలే ఈ ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో అద్భుతంగా రాణించిన రాబిన్ ఉతప్ప ఇదే విషయాన్ని చెప్పుకొచ్చాడు. చెన్నై సూపర్ కింగ్స్ అంటే కేవలం ఒక జట్టు మాత్రమే కాదు ఒక ఎమోషన్ అంటూ రాబిన్ ఊతప్ప అన్నాడు. జట్టు ఐపీఎల్ టైటిల్ గెలిచిన సందర్భంగా తీసిన చెన్నై జట్టు ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో పంచుకున్నాడు రాబిన్ ఉతప్ప. ఈ జట్టు ఒక కుటుంబం.. నేను దేవుడికి.. మా బృందం లోని ప్రతి ఒక్కరికి నా అభిమానులకు ఎప్పటికీ కృతజ్ఞుడి గా ఉంటాను. మేము కలిసి సృష్టించిన జ్ఞాపకాలు నా జీవితాంతం మరచిపోలేను మిలియన్ థాంక్స్ అంటూ రాబిన్ ఉతప్ప చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl