2021 ఐసిసి టీ20 ప్రపంచ కప్ నిర్వాహణ హక్కులు మన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కే ఉన్న దేశంలో కరోనా కేసుల కారణంగా దానిని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా నిర్వహించాల్సి వస్తుంది. అయితే నిన్న ప్రారంభమైన ఈ ఐసిసి టీ20 ప్రపంచ కప్ లో ఈ రోజు ఇప్పటికే అర్హత సాధించిన 8 జట్ల మధ్య వార్మప్ మ్యాచ్లు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా ఈరోజు మన భారత జట్టు ఇంగ్లాండ్ జట్టు తో తలపడింది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ఛేజింగ్ కు వచ్చిన భారత జట్టు ముందు 189 పరుగుల భారీ లక్ష్యం ఉంది. అయితే టీమిండియాకు ఓపెనర్లు కె.ఎల్.రాహుల్. ఇషాన్ కిషన్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. వీరిరువురూ మొదటి వికెట్ కు 81 పరుగులు జోడించారు. ఆ తర్వాత రాహుల్ 24 బంతుల్లో 51 పరుగులు చేసి ఔట్ కాగా ఇషాన్ కిషన్ 46 బంతుల్లో 70 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. ఇక కెప్టెన్ విరాట్ కోహ్లీ 13 బంతుల్లో కేవలం 11 పరుగులు చేయగా...సూర్యకుమార్ యాదవ్ కేవలం 8 పరుగులు చేసి ఔట్ కాగా రిషబ్ పంత్ చివరి వరకు ఉండి 14 బంతుల్లో 29 పరుగులతో రాణించాడు. అలాగే హార్థిక్ పాండ్యా 10 బంతుల్లో 12 పరుగులు చేశాడు.

దాంతో మరో ఆరు బంతులు మిగిలి ఉండగానే భారత జట్టు మూడు వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది దాంతో ఈ వామప్ మ్యాచ్లో విజయాన్ని తన ఖాతాలో వేసుకుని ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది భారత జట్టు. అయితే ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టుకు అనుకున్న ఆరంభం లభించకపోయినా చివర్లో జానీ బెయిర్స్టో 49 పరుగులు, మొయిన్ అలీ 43 పరుగులతో రాణించడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేయగలిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: