భారత్ పాకిస్తాన్ మధ్య ఎన్నో దశాబ్దాల నుంచి శత్రుత్వం కొనసాగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ శత్రుత్వం అటు క్రికెట్లో కూడా కొనసాగుతూనే ఉంటుంది. సాధారణంగా భారత జట్టు ఏదైనా ప్రత్యర్థి జట్టు తో మ్యాచ్ ఆడినప్పుడు ఓడిన గెలిచిన కూడా క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తూ ఉంటుంది. కానీ పాకిస్తాన్తో మ్యాచ్ అంటే మాత్రం అటు క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే కాదు మైదానంలో ఆడే ఆటగాళ్ళు సైతం తప్పనిసరిగా గెలవాల్సిన లక్ష్యంతోనే బరిలోకి దిగుతున్నారు. ఇక పాకిస్తాన్ భారత్ మధ్య మ్యాచ్ జరుగుతుంది అంటే కేవలం భారత ప్రేక్షకులు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేక్షకులందరూ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు.



 అయితే ఇప్పటికే పాకిస్థాన్లో ద్వైపాక్షిక మ్యాచ్ లు ఆడటాన్ని పూర్తిగా భారత్ నిషేధించింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పాకిస్తాన్ భారత్ మధ్య మ్యాచ్ చూడాలి అంటే అటు ఐసిసి నిర్వహించే వరల్డ్ కప్ లో నే సాధ్యం అవుతుంది అని చెప్పాలి. ఇక ఇలా వరల్డ్ కప్ లో ఈ రెండు జట్లు తలపడ్డాయి అంటే అప్పుడు క్రికెట్  ప్రపంచం మొత్తం కళ్లార్పకుండా మ్యాచ్ వీక్షిస్తూ ఉంటుంది. అయితే మరికొన్ని రోజుల్లో టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది అనే విషయం తెలిసిందే. ఇకపోతే ఈ నెల 24వ తేదీన టీమ్ ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. ఇక ఈ మ్యాచ్ గురించి అటు ప్రేక్షకులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.



 అయితే ఇప్పటి వరకు ఐసీసీ టోర్నీలో పాకిస్తాన్ భారత్ మధ్య మ్యాచ్ పలుమార్లు జరిగిన ప్రతి సారి కూడా భారత్ దే పైచేయి  కావడం గమనార్హం. అంతేకాకుండా టి20 వరల్డ్ కప్ లో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్  జరిగిన సమయంలో ఒక్కసారి కూడా కోహ్లీ వికెట్ తీయలేకపోయారూ పాకిస్తాన్ బౌలర్లు అని చెప్పాలి. ఇక మరోవైపు రోహిత్ శర్మ కి కూడా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో మంచి స్కోరు చేసాడు. వరుసగా 52, 111, 140 పరుగులు చేసి సత్తా చాటాడు. ఈ క్రమంలోనే టి-20 వరల్డ్ కప్ లో వీళ్ళిద్దరూ కలిస్తే ఇక ఊచకోత అని అంటున్నారు ప్రేక్షకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: